Breaking News
  • సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత. సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స. కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్‌ యాదవ్‌.
  • తెలంగాణలో ఇవాళ కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ లో ఇప్పటి వరకు 471కరోనా పాజిటివ్ కేసులు . ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల నుంచి 45 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 412 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
  • ఈ రోజుతో మార్కస్ కు వెళ్లిన వారితో పాటు 665 టెస్టులు చేస్తే 18 మాత్రమే . 385 మంది మార్కస్ కాంటాక్ట్స్. 45 మంది డిశ్చార్జ్. మొత్తం 414 మంది ట్రీట్మెంట్స్ పొందుతున్నారు. తెలంగాణలో 1ఒక్కరు మాత్రమే వెంటిలేటర్ పై ఉన్నారు. 22 కళ్ళ అందరూ డిశ్చార్జ్ అవుతారు.
  • లాక్‌డౌన్‌తో చుక్కేసుకుంటే కానీ చక్కగా ఉండలేని మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. బ్లాక్‌లో వేలకు వేలు పోసి లిక్కర్‌ బాటిళ్లు కొనుక్కుంటున్నారు. అంత డబ్బు పెట్టలేని సామాన్యులు మాత్రం పిచ్చేక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వైన్‌షాపులు తెరచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారు.
  • నిజామాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.

పరీక్ష సమయంలో పిల్లలు తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే!

These are the foods that children should eat during the test, పరీక్ష సమయంలో పిల్లలు తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే!

పరీక్షలంటేనే పిల్లలు భయపడుతూంటారు. అందులో ఏం వస్తాయో? ఇంకా ఏం చదవాలో అని గాబరా పడిపోతూ ఉంటారు. ఈ కారణంగా ఆత్మనూన్యత లోపిస్తుంది. భయం పెరుగుతుంది. దీంతో మెదడుపై ఒత్తిడి పెరిగి.. ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. మరి పరీక్షల సమయాల్లో పిల్లలు ఎలా ఉండాలి? దానికి తల్లిదండ్రులు ఏం చేయాలి? అనే చిన్న టిప్స్ మీకోసం అందిస్తోంది టీవీ9 వెబ్ సైట్. మరి అవేంటో ఓ లుక్కేసేయండి.

1. ముందుగా పిల్లల్లో పరీక్షల భయం పోగొట్టాలంటే.. తల్లిదండ్రులు వారిలో ముందు నుంచీ ఆలోచనా జ్ఞానం పెంచాలి. జరిగింది చిన్న విషయమేనని.. ప్రయత్నిస్తే మళ్లీ సాధ్యమవుతుందని చెప్పాలి.
2. మార్కుల విషయంలో వారితో కోపంగా కాకుండా.. వాళ్లకి అర్థమయ్యే విధంగా చెప్పడం మంచి పద్దతి.
3. ఎన్ని పనులున్నా సరే.. పరీక్షల సమయంలో.. పిల్లలతో కూర్చొని వారితో మాట్లాడటం మంచింది.
4. ఇక అలాగే.. వారికి మంచి ఆహారం కూడా అందించాలి. కోడిగుడ్లు తినడం వల్ల న్యూరో ట్రాన్స్ మీటర్స్ చురుగ్గా పనిచేస్తాయి. ఇవి మెదడు పనితీరును వేగవంతం చేస్తాయి.
5. పరీక్షల సమయంలో వాల్ నట్స్ తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. ఇవి మెదడుకు బూస్టర్స్‌గా పని చేస్తాయి
6. ఆకు కూరల్లో బ్రెయిన్ ప్రొటెక్టివ్‌కు సహాయపడే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
7. అవకాడో జ్యూస్ వారానికి రెండు సార్లు తాగించడం ద్వారా బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. వీటిలో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.
8. అలాగే ఎగ్జామ్‌కి ముందు చాక్లెట్ తింటే చాలా మంచింది.

Related Tags