ప్రారంభమైన తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలు

తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు దీనికి సంబంధించిన పోలింగ్ జరుగనుంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టర్స్ నుంచి సభ్యులు ఈ ఓటింగ్ లో పాల్గొననున్నారు. అధ్యక్షుడుగా ఈసారి ఎగ్జిబిటర్స్ సెక్టర్ నుండి ఏసియన్ ఫిలిమ్స్ అధినేత నారాయణ దాస్ నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా ఈ సారి ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నాలుగు సెక్టార్లుగా జరుగుతున్న విషయం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్- […]

ప్రారంభమైన తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలు
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 8:25 AM

తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు దీనికి సంబంధించిన పోలింగ్ జరుగనుంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టర్స్ నుంచి సభ్యులు ఈ ఓటింగ్ లో పాల్గొననున్నారు. అధ్యక్షుడుగా ఈసారి ఎగ్జిబిటర్స్ సెక్టర్ నుండి ఏసియన్ ఫిలిమ్స్ అధినేత నారాయణ దాస్ నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా ఈ సారి ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నాలుగు సెక్టార్లుగా జరుగుతున్న విషయం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్- ఎగ్జిబిటర్- నిర్మాతలు- స్టూడియో యజమానులు ఇందులో పాల్గొననున్నారు. వీళ్లందరి కోసం రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతుంటాయి. దీని నుంచే ఛాంబర్ కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకుంటారు.