Telangana: ‘అన్నయ్య’ రిక్షా యాత్రకూ బ్రేక్.. అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు..!

| Edited By: Ravi Kiran

Jun 17, 2022 | 3:53 PM

Telangana: తన చెల్లెలికి న్యాయం చేయాలని కోరుతూ, గత నెలలో ఎడ్లబండిపై ఢిల్లీ యాత్ర చేపట్టిన దుర్గారావు, మరోసారి రిక్షా యాత్ర ప్రారంభించారు.

Telangana: ‘అన్నయ్య’ రిక్షా యాత్రకూ బ్రేక్.. అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు..!
Brother Rikshaw
Follow us on

Telangana: తన చెల్లెలికి న్యాయం చేయాలని కోరుతూ, గత నెలలో ఎడ్లబండిపై ఢిల్లీ యాత్ర చేపట్టిన దుర్గారావు, మరోసారి రిక్షా యాత్ర ప్రారంభించారు. కానీ, ఆ యాత్రకు బ్రేక్‌ వేశారు పోలీసులు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన నేలవెల్లి నాగ దుర్గారావు, రిక్షాపై చేపట్టిన ఢిల్లీ యాత్రకు బ్రేక్‌ పడింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కొరివి దగ్గర ఆయన్ను పొలీసులు అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు చెల్లెలు నవ్యతకు చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌తో 2018లో పెళ్లి జరిగింది. కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కానీ, కొంతకాలంగా నవ్యతను భర్తతోపాటు, అత్తారింటి వారు వేధించారు. దీంతో నాగ దుర్గారావు చందర్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, కేసులో ఎలాంటి పురోగతి లేకుండా చేశారు నరేంద్రనాథ్. దీంతో తమకు న్యాయం జరగదని భావించిన దుర్గారావు, ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టులో, మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఎడ్లబండిపై ఢిల్లీకి బయలుదేరాడు. అలా ఎడ్లబండిపై ఢిల్లీ వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతోపాటు కలెక్టర్ కూడా వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి వారాలు గడుస్తున్నా ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో మళ్లీ తిరిగి ఢిల్లీ బాటపట్టాడు దుర్గారావు. ఈసారి రిక్షాపై ఢిల్లీకి బయలుదేరాడు. ఆ రిక్షాకు సీజేఐ ఎన్వీ రమణ ఫొటో, జాతీయ జెండా రంగులు వేసుకొని బయలుదేరాడు. అయితే, సీజేఐ ఫొటో రిక్షాకు పెట్టుకోవడం, ముందస్తు సమాచారం లేకుండా వెళ్లడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 151 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు నందిగామ రూరల్ సీఐ నాగేంద్ర కుమార్.

ఇవి కూడా చదవండి