Vande Bharat Express: గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్ నుండి తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. గంటకు 180 కి.మీ వేగం

|

Dec 06, 2022 | 7:46 PM

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల్లో మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ రైలులో అత్యాధునిక సదుపాయాలతో పాటు, అనేక ఫీచర్స్‌..

Vande Bharat Express: గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్ నుండి తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. గంటకు 180 కి.మీ వేగం
Vande Bharat Express
Follow us on

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల్లో మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ రైలులో అత్యాధునిక సదుపాయాలతో పాటు, అనేక ఫీచర్స్‌ ఉన్నాయి. తక్కువ వ్యవధిలో కొత్త సెమీ-హై-స్పీడ్ రైలు అందుబాటులోకి వచ్చింది. అందుకే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అనేక మందిని ఆకర్షించింది. భారతీయ రైల్వే ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండగా, సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను త్వరలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం..  పర్యాటక, సంస్కృతి, అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. అయితే రోలింగ్ స్టాక్ డిమాండ్‌ను తీర్చడంలో పరిమితుల కారణంగా దీనికి సమయం పట్టే అవకాశం ఉంది.

సికింద్రాబాద్ – విజయవాడ మధ్య కొత్త తరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కొత్త సంవత్సరం నుండి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభమయ్యే తేదీ ఇంకా ఖరారు కాలేదు. రైల్వే అధికారులు ట్రాక్ అప్‌గ్రేడేషన్ పూర్తి చేసిన తర్వాత తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును విశాఖపట్నం వరకు పొడిగించే యోచనలో భారతీయ రైల్వే ఉందని నివేదిక పేర్కొంది. మార్గం పొడిగింపు ఫిబ్రవరి 2023లో జరిగే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కాజీపేట మార్గంలో నడిచే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఇది బయలుదేరిన రెండు నిమిషాల్లోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంటుంది. అయితే సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య కాజీపేట రూట్‌లో ట్రాక్‌ గరిష్ట వేగ సామర్థ్యం గంటకు రూ.130 కిలోమీటర్లు. ఈ ట్రాక్‌ సామర్థ్యాన్ని 180 కి.మీ పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌-విజయవాడ ప్రయాణించాలంటే 8 నుంచి 9 గంటల సమయం పడుతుంది. అయితే ఈ రూట్‌లో వందే భారత్‌ ప్రారంభమైతే ఈ రెండు నగరాల మధ్య అతి తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. ఈ రైలులో 16 కోచ్‌లు ఉండగా, మొత్తం 1128 సీట్లు ఉంటాయి.

ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం?

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం మంత్రి కిషన్‌రెడ్డి మోడీని కోరినట్లు సమాచారం. ట్రాక్‌ అప్‌గ్రేడ్‌, సిగ్నలింగ్‌కు సంబంధించిన పనులన్ని పూర్తిగానే రైలు ప్రారంభంపై తేదీ ఖరారు అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి