AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూరియా కోసం లక్కీ డ్రా.. గణపతి మండపంలోనే వినూత్న నిరసన! అసలేం జరిగిందంటే?

నిజామాబాద్‌లో యూరియా కొరతపై రైతుల కష్టాలను చూపించేందుకు యువత వినూత్న నిరసన తెలిపింది. రూప్లా తండాలో కేవలం 99 రూపాయలకే టోకెన్ ఇచ్చి యూరియా కోసం లక్కీ డ్రా నిర్వహించారు. విజేతకు మూడు యూరియా బస్తాలను బహుమతిగా ప్రకటించారు. ఎరువుల కోసం రైతులు పడుతున్న పాట్లను, యాప్ బుకింగ్‌లలో సమస్యలను ఈ నిరసన ఎత్తి చూపింది. యూరియా కొరతను పరిష్కరించి, రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూడాలని యువత డిమాండ్ చేస్తోంది.

యూరియా కోసం లక్కీ డ్రా.. గణపతి మండపంలోనే వినూత్న నిరసన! అసలేం జరిగిందంటే?
Nizamabad Farmers Urea Protest
Diwakar P
| Edited By: |

Updated on: Sep 17, 2026 | 5:39 PM

Share

యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలకు అద్దం పట్టేలా నిజామాబాద్ జిల్లాలో యువత వినూత్న నిరసన చేపట్టింది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రూప్లా తండాలో గణపతి మండపం వేదికగా యూరియా కోసం లక్కీ డ్రా నిర్వహించారు. బంజారా కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో కేవలం 99 రూపాయలకే టోకెన్ ఇచ్చి లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పించారు. లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన రైతుకు ఏకంగా మూడు యూరియా బస్తాలను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. సాధారణంగా లక్కీ డ్రాలో బహుమతులుగా నగదు, బహుమతులు ఇస్తారు.. కానీ ఇక్కడ మాత్రం రైతులకు అత్యవసరమైన యూరియా బస్తాలనే గిఫ్ట్‌గా పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

యూరియా కోసం రైతులు రోజుల తరబడి తిరుగుతున్నారని.. యాప్‌లో బుక్ చేసుకున్నా సకాలంలో ఎరువు అందడం లేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. పంటకు అవసరమైన ఎరువు కోసం రైతులు ఇలా లక్కీ డ్రాపై ఆధారపడే పరిస్థితి వచ్చిందంటూ అధికారుల దృష్టిని ఆకర్షించేందుకే ఈ నిరసన చేపట్టామని బంజారా కింగ్స్ యూత్ సభ్యులు చెబుతున్నారు. యూరియా కొరత సమస్యను పరిష్కరించి.. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us
యూరియా కోసం లక్కీ డ్రా.. గణపతి మండపంలో వినూత్న నిరసన ఎందుకంటే..?
యూరియా కోసం లక్కీ డ్రా.. గణపతి మండపంలో వినూత్న నిరసన ఎందుకంటే..?
కనికరం లేకుండా కుక్కను నదిలోకి విసిరిన మహిళ..!
కనికరం లేకుండా కుక్కను నదిలోకి విసిరిన మహిళ..!
వినూత్న గణనాథులు కివీ ఫ్రూట్,జీడిపప్పుతో ప్రత్యేక వినాయక విగ్రహాల
వినూత్న గణనాథులు కివీ ఫ్రూట్,జీడిపప్పుతో ప్రత్యేక వినాయక విగ్రహాల
బాబోయ్ గూగుల్ జాబ్ ఇట్టా ఉంటుందా.. జీతం కాదు వీటి గురించి..
బాబోయ్ గూగుల్ జాబ్ ఇట్టా ఉంటుందా.. జీతం కాదు వీటి గురించి..
దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?
దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?
మృతదేహానికి ఇచ్చే గౌరవం ఇదేనా..!
మృతదేహానికి ఇచ్చే గౌరవం ఇదేనా..!
ఇన్నాళ్లు తెలియలే..అరెరే గుడ్డు పెంకులు తియ్యడం ఇంత ఈజీనా?
ఇన్నాళ్లు తెలియలే..అరెరే గుడ్డు పెంకులు తియ్యడం ఇంత ఈజీనా?
పేదవారు కూడా ధనవంతులవుతారు.. సూర్య సంచారంతో వీరికి అదృష్టమే
పేదవారు కూడా ధనవంతులవుతారు.. సూర్య సంచారంతో వీరికి అదృష్టమే
చాణక్య నీతి : పెళ్లిచేసుకునే అబ్బాయి పేదవాడైనా ఈలక్షణాలు ఉండాలి
చాణక్య నీతి : పెళ్లిచేసుకునే అబ్బాయి పేదవాడైనా ఈలక్షణాలు ఉండాలి
రైతు కుటుంబాన్ని మింగేసిన అప్పుల భారం, కుటుంబ కలహాలు!
రైతు కుటుంబాన్ని మింగేసిన అప్పుల భారం, కుటుంబ కలహాలు!