MLA poaching case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దూకుడు.. తుషార్‌ అండ్‌ జగ్గుస్వామి కోసం వేట..

|

Nov 28, 2022 | 8:29 AM

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసు మరో కీలక మలుపు తిరగబోతోందా..? ఎమ్మెల్యేలకు ఎర కేసులో రేపు కోర్టు ఏం చెప్పబోతుంది.. పోలీసులు ఎలాంటి ఆధారాలను సమర్పించనున్నారు.. ఈ విషయాలన్నీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

MLA poaching case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దూకుడు.. తుషార్‌ అండ్‌ జగ్గుస్వామి కోసం వేట..
Telangana MLAs Poaching Case
Follow us on

TRS MLA poaching case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసు మరో కీలక మలుపు తిరగబోతోందా..? ఎమ్మెల్యేలకు ఎర కేసులో రేపు తెలంగాణ కోర్టు ఏం చెప్పబోతుంది.. పోలీసులు ఎలాంటి ఆధారాలను సమర్పించనున్నారు.. ఈ విషయాలన్నీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) మరింత దూకుడు పెంచింది. రేపు కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. బీజేపీ ముఖ్యనేత బీఎల్‌ సంతోష్‌తోపాటు జగ్గుస్వామి, తుషార్‌, అడ్వకేట్‌ శ్రీనివాస్‌ పాత్రను నిగ్గుతేల్చేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తోంది. అయితే, ఇప్పటివరకు శ్రీనివాస్‌ ఒక్కరే సిట్‌ విచారణకు హాజరుకాగా.. జగ్గుస్వామి, తుషార్‌పై లుక్‌అవుట్‌ నోటీస్‌ ఇష్యూ చేసింది సిట్. బీఎల్‌ సంతోష్‌ కోర్టు నుంచి ఊరట పొందడంతో ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తోంది.

తుషార్‌ అండ్‌ జగ్గుస్వామిని ఇంటరాగేట్‌ చేస్తే కీలక ఆధారాలు, సమాచారం దొరుకుతుందని భావిస్తున్నారు అధికారులు. ఈ ఇద్దరే ఈ కేసులో కీ పర్సన్స్‌గా భావిస్తోంది సిట్‌. బేరసారాల వెనకున్న పెద్దలకు మీడియేటర్స్‌గా జగ్గుస్వామి, తుషార్‌ ఉన్నారని అనుమానిస్తోంది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో రామచంద్రభారతి జరిపిన బేరసారాల వెనక తుషార్‌, జగ్గుస్వామికే కీలక పాత్రగా భావిస్తోంది. ఇక, అనుమానితుల కింద మరో న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌ను రెండు రోజులపాటు ప్రశ్నించింది సిట్‌. నిందితులతో అతడికున్న ఆర్ధిక లావాదేవీలపై సుదీర్ఘంగా విచారించింది.

ఇదే కేసులో మరో నిందితుడైన నందకుమార్‌ను రెండ్రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతించింది కోర్టు. ఫిలింనగర్‌ ల్యాండ్‌ లీజ్‌ కేసులో ఈరోజు, రేపు నందును ప్రశ్నించనున్నారు పోలీసులు. ఇదే కేసులో నందకుమార్‌ భార్యను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..