AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagga Reddy: కుమార్తె పెళ్లికి అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించిన జగ్గారెడ్డి

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో జరగబోతోంది. ఈ వేడుక ఆగస్టు 7న సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కుమార్తె పెళ్లి పత్రిక అందజేశారు.

Jagga Reddy: కుమార్తె పెళ్లికి అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించిన జగ్గారెడ్డి
Jagga Reddy Family With Rahul Gandhi
Ram Naramaneni
|

Updated on: Jul 14, 2025 | 3:50 PM

Share

తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషిస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంట పెళ్లి సందడి సన్నాహాలు మొదలయ్యాయి. ఆయన కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో ఆగస్టు 7న సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. అన్ని వర్గాల నుంచి తరలివచ్చే అతిథులతో ఈ వేడుక ఓ గ్రాండ్ సెలబ్రేషన్ కానుంది.

ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. కుమార్తె వివాహానికి హాజరుకావాలని ఆహ్వానం అందజేశారు. గాంధీ కుటుంబానికి దగ్గరిగా మెలిగే నేతగా జగ్గారెడ్డికి పేరున్న నేపథ్యంలో.. రాహుల్‌గాంధీ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

జగ్గారెడ్డి సతీమణి నిర్మల ప్రస్తుతం తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGIIC) చైర్‌పర్సన్‌గా ఉన్నారు. జగ్గారెడ్డి ఇంట వివాహ వేడుకకు రాజకీయ, సామాజిక, పారిశ్రామిక రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. వివాహం సంగారెడ్డి రామ్‌నగర్ ప్రాంతంలోని రామ్ మందిర్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు.

Wedding Invitation

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!