తాటి క‌ల్లు తాగితే క‌రోనా పోతుందా… తెలంగాణ‌లోని ఆ ప్రాంతంలో విప‌రీత‌మైన డిమాండ్.. ఒక‌రోజు ముందే బుకింగ్

|

May 04, 2021 | 10:38 AM

తాటి కల్లు తాగితే క‌రోనా పోతుందా..? ఏ మందులకు లొంగని మహమ్మారి కల్లుకు చెల్లు అంటుందా..? ఎస్ నిజమేనంటున్నారు ఆ ఊరి ప్రజలు. తాటి కల్లు......

తాటి క‌ల్లు తాగితే క‌రోనా పోతుందా... తెలంగాణ‌లోని ఆ ప్రాంతంలో విప‌రీత‌మైన డిమాండ్.. ఒక‌రోజు ముందే బుకింగ్
Toddy
Follow us on

తాటి కల్లు తాగితే క‌రోనా పోతుందా..? ఏ మందులకు లొంగని మహమ్మారి కల్లుకు చెల్లు అంటుందా..? ఎస్ నిజమేనంటున్నారు ఆ ఊరి ప్రజలు. తాటి కల్లు తాగితే కరొనా రాదని, గట్టిగా నమ్ముతున్నారు. అలవాటు లేనివారు కూడా తాటి కల్లు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో తాటి కల్లు తాగితే క‌రోనా రాదని, తాటికల్లులో వైరస్ కారకాలను చంపేసే ఆయుర్వేద గుణం ఉందని, అందుకే తాటి కల్లు తాగిన వారికి క‌రోనా రావడం లేదని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు.

తాటి కల్లు తాగితే కరోనా రాదన్న విషయాన్ని సైంటిస్టులు పత్రికల్లో చెప్పారని అంటున్నారు. తాటి కల్లు ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ల పనిచేసే ఔషధ గుణాలున్న దివ్య ఔషధం అని, తాటి కల్లు తాగితే శరీరానికి కూడా ఎంతో మంచిదని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. గీత కార్మికులకు ఫోన్ చేసి మరీ కల్లును బుక్ చేసుకుంటున్నారు స్థానికులు. తాటి కల్లుకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ఒకరోజు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. లేదంటే కల్లు దొరకడం లేదని చెబుతున్నారు.

కల్లు తాగిన వారికి ఈ ఊరిలో ఎవరికీ కరోనా వైరస్ సోకడం లేదని కూడా చెప్తున్నారు స్థానికులు. ఏది ఏమైనా తాటి కల్లు తాగితే కరోనా పోతుందో, లేదో తెలియదు కానీ తాటి కల్లు తాగితే కరోనా రాదని ఈ ప్రాంత ప్రజలు బలంగా నమ్ముతున్నారు. స్థానికుల నమ్మకం ఎలా ఉన్నా గీత కార్మికులకు మాత్రం బాగా గిరాకీ అవుతుందంటున్నారు.

Also Read: దేశంలోనే మొదటిసారిగా నెహ్రూ జూ పార్క్ లోని ఎనిమిది సింహాలకు కరోనా పాజిటివ్!

కిచెన్ లో సింక్ పైపు బాగు చేశాడు.. ప్లంబ‌ర్ వేసిన బిల్ చూసి మైండ్ బ్లాంక్