మేడారం అడవుల్లో మహా ప్రళయం.. సమ్మక్క సారలమ్మల దయతో పెను విపత్తు తప్పిందా..!

సాధారణంగా పెద్ద గాలి వేసిందనుకోండి.. పదోపరకో చెట్లు పడిపోవడం సహజం. అదే సుడిగాలి వస్తే మరికొన్ని చెట్లు పడిపోవడం చూస్తుంటాం. కానీ, రాత్రికి రాత్రి 50 వేల చెట్లు.. అదీ అడవి మధ్యలో పడిపోవడం సాధ్యమేనా? అసలు అడవి మధ్యలో అన్ని చెట్లు పడిపోవడం అనేది మనం చెప్పుకున్నంత సులువేనా? చెట్లు నేల కూలడానికి అసలు కారణాలు ఏంటి..? అక్కడి నేల స్వభావం ఏమైనా మారిందా..?

మేడారం అడవుల్లో మహా ప్రళయం.. సమ్మక్క సారలమ్మల దయతో పెను విపత్తు తప్పిందా..!
Medaram Forest

Edited By: Janardhan Veluru

Updated on: Sep 05, 2024 | 3:46 PM

ఉమ్మడి వరంగల్‌ జిల్లా.. ప్రస్తుతం మలుగు జిల్లాల్లోని తాడ్వాయి అడవుల్లో అలజడి రేగింది. అటవీ ప్రాంతంలో అసలేం జరుతోంది..? రాత్రికి రాత్రికి వేలాది వృక్షాలు వేర్లతో సహా పీకి పారేసినట్టుగా నేలమట్టమయ్యాయి. 200 హెక్టార్లలో 50 వేలకుపైగా అరుదైన జాతి వృక్షాలు నేలమట్టం అయ్యాయంటే మామూలు విషయం కాదు. పడిపోయిన చెట్లు కూడా చిన్న సైజు చెట్లు కాదు. మహావృక్షాలు సైతం చిగురుటాకుల్లా రాలిపోవడం మిస్టరీగా మారింది. సాధారణంగా పెద్ద గాలి వేసిందనుకోండి.. పదోపరకో చెట్లు పడిపోవడం సహజం. అదే సుడిగాలి వస్తే మరికొన్ని చెట్లు పడిపోవడం చూస్తుంటాం. కానీ, రాత్రికి రాత్రి 50 వేల చెట్లు.. అదీ అడవి మధ్యలో పడిపోవడం సాధ్యమేనా? అసలు అడవి మధ్యలో అన్ని చెట్లు పడిపోవడం అనేది మనం చెప్పుకున్నంత సులువేనా? చెట్లు నేల కూలడానికి అసలు కారణాలు ఏంటి..? అక్కడి నేల స్వభావం ఏమైనా మారిందా..? అభయారణ్యం మొత్తం కదిల్చిన ఈ విపత్తును ఏమంటారు..? అదే ఇప్పుడు ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌తో పాటు స్థానికులనూ ఆందోళనకు గురి చేస్తోంది. మొన్నటి వరకు ఉన్న మహావృక్షాలు ఏమైపోయాయి అని అడిగిన ప్రశ్నకు అటవీశాఖ అధికారులు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు. శాస్త్రీయ కారణాలను అన్వేషిస్తున్నారు. చెట్లు కూలిపోయిన ప్రాంతం నుంచి మట్టి శాంపిల్స్ తీసుకున్నారు. దాదాపు మూడు మీటర్ల లోతులో నుంచి మట్టి శాంపిల్స్ తీసుకుని, వాటిని ల్యాబ్‌కు పంపిచారు. శాటిలైట్ సర్వే ద్వారా కూడా అసలు ఏం జరిగిందో...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి