విద్యార్థులే టార్గెట్ గా ఈబిజ్ పేరిట నిర్వహిస్తున్న మల్టీలెవల్ మార్కెటింగ్ ముఠాకు చెక్ పెట్టారు సైబరాబాద్ పోలీసులు. ఈ లెర్నింగ్, కంప్యూటర్ కోర్సులంటూ వెయ్యి కోట్ల స్కామ్ కు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేశామన్నారు సీపీ సజ్జనార్. నిందితుల బ్యాంక్ అకౌంట్‌లలో 70 కోట్లను ఫ్రీజ్ చేశామన్నారు. ఈబిజ్ ముసుగులో సుమారు 7 లక్షల మందిని ఈ ముఠా మోసం చేసిందని తెలిపారు. ఈబిజ్ నిర్వహకుడు హితిక్ మలాన్‌ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈబిజ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఈ ముఠా నోయిడా కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.