ఎన్నికల హడావిడి పూర్తిగా ప్రారంభం కాకముందే పెద్ద ఎత్తున డబ్బు తరలుతోంది. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన హైదరాబాద్ పోలీసులకు భారీగా డబ్బు పట్టుబడింది. ముందస్తు సమాచారంతో నాలుగు ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులకు కళ్లు చెదిరే డబ్బు పట్టుబడింది. జర్కిన్‌లో 90 లక్షల రూపాయలు పెట్టుకొని తిరుగుతుండగా.. వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఎలక్షన్ నేపథ్యంలో అన్ని రకాల నిఘాను పటిష్టం చేశామన్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. 45 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డబ్బు తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు హైదరాబాద్ సీపీ.