Video: ములుగు ఏజెన్సీలో DMHO బృందం సాహసం.. 20 కుటుంబాల కోసం ఏకంగా 15 కిమీలు..

|

Jul 18, 2024 | 9:09 PM

ములుగు ఏజెన్సీలో గిరిజనులకు వైద్యం అందించేందుకు DMHO బృందం చేసిన సాహసం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. 20 కుటుంబాల ప్రాణాలు కాపాడటం కోసం వైద్యుల బృందం పెద్ద సాహసమే చేసింది. జ్వరాలతో మంచం పట్టిన గూడెం బిడ్డలకు వైద్యం అందించేందుకు DMHO అప్పయ్యతో కలిసి వైద్య బృందమంతా 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. అసలే వర్షం.. ఆపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి.

Video: ములుగు ఏజెన్సీలో DMHO బృందం సాహసం.. 20 కుటుంబాల కోసం ఏకంగా 15 కిమీలు..
Mulugu
Follow us on

ములుగు ఏజెన్సీలో గిరిజనులకు వైద్యం అందించేందుకు DMHO బృందం చేసిన సాహసం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. 20 కుటుంబాల ప్రాణాలు కాపాడటం కోసం వైద్యుల బృందం పెద్ద సాహసమే చేసింది. జ్వరాలతో మంచం పట్టిన గూడెం బిడ్డలకు వైద్యం అందించేందుకు DMHO అప్పయ్యతో కలిసి వైద్య బృందమంతా 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. అసలే వర్షం.. ఆపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. కారడవిలో కొండలు, గుట్టలు ఎక్కుతూ.. మధ్యలో 3 వాగుల్ని దాటుకుంటూ దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి గిరిజనులకు మందులు అందించారు.

ప్రస్తుతం వర్షాల కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నా.. ధైర్యం చేసి అంతా కలిసి మారుమూల ప్రాంతానికి వెళ్లారు. ఛత్తీస్ గడ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అడవుల్లో, ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో పెనుగోలు గ్రామం ఉంటుంది. అక్కడి దట్టమైన అడవిలోకి కనీసం ఎడ్ల బండి కూడా వెళ్లేదారి ఉండదు.

ఈ గుట్టపై దాదాపు 50 ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఈ గిరిజన గ్రామంలో చాలా మంది ఇప్పుడు జ్వరాలతో బాధపడుతున్నారు. వీరికి ట్రీట్‌మెంట్‌ చేసేందుకు వెళ్లిన DMHO టీమ్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

డాక్టర్ అప్పయ్యతో పాటు వైద్య సిబ్బంది అంతా భుజాన కిట్‌లు మోసుకుంటూ.. వాగులు దాటుకుంటూ అక్కడికి వెళ్లారు. గ్రామస్థుల్లో కొందరు తీవ్రమైన అనారోగ్యానికి గురవడంతో.. వారి రక్త నమూనాలు కూడా తీసుకున్నారు. అందరికీ ట్రీట్‌మెంట్‌ చేసిన తర్వాత రాత్రికి అక్కడే బస చేసి తర్వాత తిరిగి వచ్చారు. విధి నిర్వహణలో వైద్యసిబ్బంది చూపించిన చొరవను మంత్రి సీతక్క అభినందించారు.