Praja Palana: సంక్షేమ పథకాలకు ఇంకా అప్లై చేసుకోలేదా.? వెంటనే అలర్ట్‌ అవ్వండి..

|

Jan 06, 2024 | 9:13 AM

ఇదిలా ఉంటే డిసెంబర్‌ 28 ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటితో (జనవరి 6వ తేదీతో) ముగియనుంది. దీంతో ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది...

Praja Palana: సంక్షేమ పథకాలకు ఇంకా అప్లై చేసుకోలేదా.? వెంటనే అలర్ట్‌ అవ్వండి..
Praja Palana
Follow us on

తెలంగాణలో సంక్షేమ పథకాలకోసం కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజా పాలన’ పేరుతో కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అభయహస్తం పేరిట పలు పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తోంది ప్రభుత్వం. పట్టణాలు, గ్రామాలు, మండలాలు ఇలా అన్ని స్థాయిలో ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఇదిలా ఉంటే డిసెంబర్‌ 28 ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటితో (జనవరి 6వ తేదీతో) ముగియనుంది. దీంతో ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఇందుకు సంబంధించి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు కోటికి పైగా దరఖాస్తులు దాటాయి.

శుక్రవారం నాటికి 1,08,94,115 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక నేడు (శనివారం) చివరి తేదీ కావడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా చేస్తున్నారు. లాస్ట్‌ డే భారీగా అప్లికేషన్స్‌ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సంఖ్యకు అనుగుణంగా మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచేది లేదని పలువురు మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ ఇప్పుడు దరఖాస్తు చేసుకోని వారు ఉంటే.. నాలులు నెలల తర్వాత చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

 

ఇక ప్రజా పాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీలను ఈనెల 17 వతేదీలోపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎస్‌ శాంతి కుమారు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..