Telangana: ఆ కారణంతోనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు ప్లాన్.. షాకింగ్ వివరాలివే..

| Edited By: Ravi Kiran

Aug 09, 2022 | 4:07 PM

Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్రకేసులో నిందితుడు ప్రసాద్‌గౌడ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేపై హత్యాప్రయత్నం అందుకే చేశాడని..

Telangana: ఆ కారణంతోనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు ప్లాన్.. షాకింగ్ వివరాలివే..
Trs Mla Jeevan Reddy
Follow us on

Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్రకేసులో నిందితుడు ప్రసాద్‌గౌడ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేపై కక్షతోనే హత్యాప్రయత్నం చేశాడని నిర్ధారించారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తెలంగాణలో సంచలనం రేపిన ఆర్మూర్‌ TRS ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యాకు కుట్ర కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. నిందితుడు ప్రసాద్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకొని వివిధ కోణాల్లో విచారించారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర కేసులోని నిందితుడి విచారణలో కీలక అంశాలు వెలుగులోకొచ్చినట్లు తెలిపారు డీసీపీ జోయల్‌ డేవిస్‌. ఎమ్మెల్యేపై కక్షతోనే నిందితుడు ప్రసాద్‌గౌడ్‌ హత్యాప్రయత్నం చేశాడని స్పష్టం చేశారు డీసీపీ.

ఈ నెల 1వ తేదీన ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని.. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది. నిందితుడు ఆర్మూర్‌ నియోజకవర్గంలోని మక్లూర్‌ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్‌ భర్త ప్రసాద్‌గౌడ్‌గా గుర్తించారు.అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇవాళ నిందితుడు ప్రసాద్‌గౌడ్‌ని అదుపులోకి తీసుకున్నారు. వివిధ కోణాల్లో పోలీసులు అతన్ని విచారించారు.

ప్రసాద్‌గౌడ్‌ భార్య కిల్లెడ సర్పంచ్‌గా ఉన్నారు. అయితే సర్పంచ్‌గా ఉన్న భార్యను అడ్డుపెట్టుకుని ప్రసాద్‌గౌడ్‌ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్‌ విచారణ జరిపి లావణ్యను సస్పెండ్‌ చేశారు. ఎమ్మెల్యే ప్రయమేయంతోనే తన భార్య సస్పెండ్ అయ్యిందని ప్రసాద్‌గౌడ్‌ కక్ష పెంచుకున్నారు. ఏప్రిల్‌లో నాందేడ్‌ వెళ్లి కత్తి కొనుగోలు చేశారు. సంతోష్‌ అనే వ్యక్తి సహకారంతో నాంపల్లిలో పిస్టల్‌ను కూడా కొనేశాడు. ఆ రోజే జీవన్‌రెడ్డిపై కాల్పులు జరిపేందుకు యత్నించినట్లు విచారణలో తేలిందన్నారు డీసీపీ జోయల్‌ డేవిస్‌. ప్రసాద్‌గౌడ్‌పై 120B, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.గతంలోనూ ఆయనపై పలు కేసులు నమోదైయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..