Telangana Municipal Elections Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణి.. ఎక్కడో తెలుసా..?

Telangana Municipal Poll Results: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది.. పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గట్టిపోటీనిస్తుండగా.. బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా ఖాతా

Telangana Municipal Elections Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణి.. ఎక్కడో తెలుసా..?
Telangana Municipal Elections Results

Updated on: Feb 13, 2026 | 1:49 PM

Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్పిపల్, కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెలుడుతున్నాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది.. పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గట్టిపోటీనిస్తుండగా.. బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా ఖాతా తెరిచింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. మొత్తం 15 స్థానాలకు గానూ 9 వార్డుల్లో కాంగ్రెస్‌, 5 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ గెలుపొందగా.. జనసేన ఒక వార్డును దక్కించుకుంది. సూర్యాపేట జిల్లా.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు సతీమణి అర్రూరి విజయలక్ష్మి గెలుపొందారు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో 336 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీకి చివరికి విజయం లభించడంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు.. ఈ విజయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు పేర్కొంటున్నారు. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో ముందు నుంచి జనసేన పార్టీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో జనసేన పోటీచేయడంతోపాటు.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తారని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా పవన్ కల్యాణ్ ను కలిసి.. తమ పార్టీకి ప్రచారం చేయాలని కోరారు. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.. ఈ క్రమంలోనే.. కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కల్యాణ్ ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఇటు జనసేన- అటు బీజేపీ అభ్యర్థుల్లో నిరాశ ఎదురైంది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 2026

తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్ 

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు లైవ్ టీవీ