Minister Ktr: తెలుగు మహిళ సీటు మార్చి ఇండిగో విమాన సిబ్బంది విపక్ష.. కేటీఆర్ ఆగ్రహం..

Minister Ktr: హిందీ, ఇంగ్లిష్ రాని కారణంగా తమ విమానంలో ప్రయాణిస్తున్న ఓ తెలుగు మహిళా సీటును బలవంతంగా మార్చారు ఇండిగో విమాన సిబ్బంది.

Minister Ktr: తెలుగు మహిళ సీటు మార్చి ఇండిగో విమాన సిబ్బంది విపక్ష.. కేటీఆర్ ఆగ్రహం..
Minister Ktr

Updated on: Sep 19, 2022 | 1:35 PM

Minister Ktr: హిందీ, ఇంగ్లిష్ రాని కారణంగా తమ విమానంలో ప్రయాణిస్తున్న ఓ తెలుగు మహిళను బలవంతంగా సీటు మార్చారు ఇండిగో విమాన సిబ్బంది. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. విమాన సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ప్రాంతీయంగా నడిచే విమానాల్లో స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని నియమించుకోవాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సూచించారు. ఇంగ్లిష్‌, హిందీ రానివారి సౌకర్యార్థం తెలుగు, తమిళ, కన్నడ తదితర భాషలు మాట్లాడేవారిని నియమించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఇండిగో సంస్థను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

వివరాల్లోకెళితే.. ఈనెల 16న ఓ మహిళ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో వస్తుండగా ఆమెకు ఇంగ్లిష్ కానీ హిందీ కానీ రాదన్న కారణంతో కూర్చున్న సీట్లోంచి తీసుకెళ్లి.. మరో చోట కూర్చోబెట్టారు. ఈ ఘటనపై అహ్మదాబాద్ ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దేవస్మిత తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 2ఎ సీట్లో ఎగ్జిట్ డోర్ దగ్గర కూర్చున్న సదరు మహిళకు మరో భాష రాదని 3సి సీట్లోకి మార్చేశారు. ఆమెతో మాట్లాడిన ఫ్లైట్ అటెండెంట్ భద్రతా పరమైన ఆందోళనగా పేర్కొంటూ ఆ మహిళ పట్ల వివక్ష ప్రదర్శించారని ట్వీట్ చేశారు. సదరు తెలుగు మహిళ ఫొటోను కూడా షేర్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించి ట్వీట్ చేశారు. స్థానిక భాషలు మాత్రమే మాట్లాడగలిగిన ప్రయాణికులను కూడా గౌరవించాలని సూచిస్తూ ఇండిగో యాజమాన్యానికి ట్యాగ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us