Ibomma Ravi: ఐబొమ్మ రవికి బిగ్‌ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు!

తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామాం వెలుగు చూసింది. ఐబోమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఈ కేసులో తాజాగా తెలంగాణ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రవికి కండిషన్‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

Ibomma Ravi: ఐబొమ్మ రవికి బిగ్‌ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు!
Ibomma Piracy Case

Updated on: Feb 17, 2026 | 10:05 PM

సినిమా పైరసీతో నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన రవిని.. గత ఏడాది నవంబర్ 16న సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు పాల్పడినందున అతడిపై ఐదు కేసులు నమోదు చేశారు.కస్టడీలో భాగంగా అతడిని 20 రోజులు పాటు సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు? వచ్చిన డబ్బులను ఎక్కడికి తరలించాడు? అనే అంశాలపై కీలక సమాచారం సేకరించారు. అయితే బెయిల్ కోసం రవి పలుమార్లు చేసిన దరఖాస్తును కోర్టు కొట్టివేసింది.

అయినా పట్టువదలకుండా ప్రయత్నించిన రవికి బిగ్ రిలీఫ్‌ ఇస్తూ ఎట్టకేలకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.రవి తన పాస్‌పోర్టును కోర్టులో సమర్పించడంతో పాటు ఇంటర్నెట్‌ను ఉపయోగించవద్దని ఆదేశించింది కోర్టు. ఒకవేళ నెట్ వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీసుల ముందు హాజరవ్వాలని బెయిల్ షరతుల్లో తెలిపింది నాంపల్లి కోర్టు.

పైరసీతో రూ.13 కోట్ల 40 లక్షలు వచ్చాయని విచారణలో పోలీసులకు చెప్పాడు రవి. రవికి ఉన్న మొత్తం 7 బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం సొమ్ము డిపాజిట్‌ అయింది. ఆన్లైన్ బెట్టింగ్ యాడ్ల ద్వారా ఒకసారి ఏకంగా 1కోటి 58 లక్షలు వచ్చాయని కూడా విచారణలో తేలింది. ట్యాక్స్ ఇబ్బందులు రాకూడదని తన సోదరి చంద్రికకు 90 లక్షలు పంపాడు. అలాగే లావాదేవీలు మొత్తాన్నీ విదేశీ కరెన్సీ రూపంలోనే చేశాడు.కొంత కాలం పాటు కూకట్‌పల్లి ఉషా ముళ్లపూడి దగ్గరలో ఒక ఆఫీస్ నడిపాడు రవి. కోవిడ్ తరువాత తన బిజినెస్ మెరుగుపడిందని పోలీసులకు వివరించాడు రవి. దాంతో తనకు బాగా డబ్బులొచ్చాయని ఒప్పుకున్నాడు.ఇప్పుడు బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత అతడు ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us