Telangana Election: మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది.. బరిలో ఉంటానంటున్న చల్లమల కృష్ణారెడ్డి

టికెట్‌ తప్పకుండా వస్తుందని ఆశించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మునుగోడు నియోకవర్గ ఇన్‌చార్జి చలమల్ల కృష్ణారెడ్డిలో ఆందోళన మొదలైంది. టికెట్‌ తనకు గ్యారంటీగా వస్తుందనే విశ్వాసంతో ప్రచార రథాలు కూడా సిద్ధం చేసుకుని జోరుగా ప్రచారం సాగిస్తుండగా టికెట్‌ తనకు దక్కకపోవడంతో ఆయన షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు.

Telangana Election: మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది.. బరిలో ఉంటానంటున్న చల్లమల కృష్ణారెడ్డి
Komatireddy Krishnareddy Chalamala Krishna Reddy

Updated on: Oct 28, 2023 | 10:40 AM

మునుగోడు కాంగ్రెస్‌ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి మునుగోడు టికెట్‌ కూడా దక్కించుకున్నారు. మరోవైపు టికెట్‌ తప్పకుండా వస్తుందని ఆశించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మునుగోడు నియోకవర్గ ఇన్‌చార్జి చలమల్ల కృష్ణారెడ్డిలో ఆందోళన మొదలైంది. టికెట్‌ తనకు గ్యారంటీగా వస్తుందనే విశ్వాసంతో ప్రచార రథాలు కూడా సిద్ధం చేసుకుని జోరుగా ప్రచారం సాగిస్తుండగా టికెట్‌ తనకు దక్కకపోవడంతో ఆయన షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి తిరిగి రావడాన్ని స్వాగతించిన కృష్ణారెడ్డి మునుగోడు టికెట్‌ తనకు ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర స్థాయి నేత కావడం వల్ల ఎక్కడ నుంచైనా పోటీచేసి గెలవగలరని, మునుగోడు మాత్రం తనకు వదిలిపెట్టాలని కృష్ణారెడ్డి అక్టోబర్ 26న టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. రాజగోపాల్ రెడ్డి లేకున్నా తాను మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చానని కృష్ణారెడ్డి గుర్తు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి టికెట్‌ కేటాయించడంతో కృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో తన అనుచరులతో సమావేశమైన చల్లమల కృష్ణారెడ్డి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

వచ్చే ఎన్నికల్లో పోలీచేసేందుకు కృష్ణారెడ్డి చొరవ చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టికెట్‌ ఆశించి భంగపడిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మునుగోడు నియోకవర్గ ఇన్‌చార్జి చలమల్ల కృష్ణారెడ్డి తాను మునుగోడు నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి మునుగోడు టికెట్ తనకే వస్తుందని ఆయన అంచనా వేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఆఖరు నిమిషంలో బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో సమీకరణాలు మారాయి. కాంగ్రెస్‌ అధిష్టానం మునుగోడు టికెట్ రాజగోపాల్ రెడ్డికే కేటాయించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న కృష్ణారెడ్డి తన అనుచరులతో చౌటుప్పల్‌లో సమావేశమయ్యారు. ఈ తరుణంలో కృష్ణారెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. .

Loading...
Unable to load recommendations.
Follow Us