Dasara Holidays: దసరా సెలవులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూళ్లు, కాలేజీలకు ఆదేశాలు!

తెలంగాణలో అప్పుడే దసరా పండగ వాతావరణం మొదలైంది. అయితే ఈ పండగ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవుల తేదీలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 10 నుంచి అక్టోబర్ 22, 23 వరకు మొత్తం 13 రోజుల పాటు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా విద్యాసంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి విద్యాసంస్థ హాలిడేస్ షెడ్యూల్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

Dasara Holidays: దసరా సెలవులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూళ్లు, కాలేజీలకు ఆదేశాలు!
Dasara Holidays 2026

Updated on: Oct 05, 2026 | 8:37 AM

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు ఈ నెల 10వ తేదీ నుంచి అక్టోబర్ 22, 23 వరకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 21 వరకు సెలవులు ఉండగా.. తిరిగి అక్టోబర్ 22న కాలేజీలు ఓపెన్ అవుతాయి. స్కూల్స్ అక్టోబర్ 23న తిరిగి ప్రారంభం కానున్నాయి.

అయితే ఈ సెలవులపై స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన హాలిడేస్ షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని, ఎలాంటి స్పెషల్ క్లాసులు నిర్వహించవద్దని ఆదేశించారు. రూల్స్‌కు విరుద్ధంగా ఎవరైనా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తే.. ఆయా స్కూళ్లు, పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

ఏపీలో దసరా సెలవులు ఇవే:

ఇక ఏపీలోనూ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఏపీలోని స్కూళ్లు, కాలేజీలకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మొత్తం 10 రోజుల పాటు ఏపీలో దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 9న స్కూల్స్, కాలేజీలు చివరగా పనిచేయనున్నాయి. మళ్లీ తిరిగి అక్టోబర్ 22న ప్రారంభం కానున్నాయి. అటు ఏపీ సర్కార్ కూడా సెలవుల సమయంలో స్పెషల్ క్లాసులు నిర్వహించవద్దని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us