AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లండన్‌లో అంబేద్కర్ నివాసాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.. డైరీలో భావోద్వేగ సందేశం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో భాగంగా భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నివసించిన చారిత్రక నివాసాన్ని సందర్శించారు. 1920వ దశకంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకునే సమయంలో అంబేద్కర్ నివసించిన ఈ భవనాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్న జ్ఞాపకాలను తిలకించి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం అక్కడి సందర్శకుల పుస్తకం డైరీలో తన సందేశాన్ని రాసుకొచ్చారు..

లండన్‌లో అంబేద్కర్ నివాసాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.. డైరీలో భావోద్వేగ సందేశం!
Revanth Reddy London Visit
Jyothi Gadda
|

Updated on: Aug 23, 2026 | 8:12 AM

Share

లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చారిత్రక నివాసాన్ని సందర్శించారు. 1920-1923 ప్రాంతంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఉన్నత చదువులు అభ్యసించే సమయంలో అంబేద్కర్ నివసించిన ఇంటిని చూసి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మహానీయుడు నడియాడిన ప్రదేశాన్ని సందర్శించడం తనకెంతో గర్వకారణంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు.

చారిత్రక జ్ఞాపకాల పరిశీలన:

లండన్‌లోని 10 కింగ్ హెన్రీ రోడ్‌లో ఉన్న ఈ స్మారక భవనంలో అంబేద్కర్ ఉపయోగించిన వస్తువులు, ఆయన రాసిన పుస్తకాలు, అరుదైన చిత్రాలను ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలించారు. అపారమైన జ్ఞాన తృష్ణతో, ఎన్నో ప్రతీకూల పరిస్థితులను ఎదుర్కొంటూ అంబేద్కర్ ప్రపంచ స్థాయి విద్యావేత్తగా ఎదిగిన తీరును ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

డైరీలో భావోద్వేగ నోట్:

ఈ సందర్శన ముగిసిన అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన విజిటర్స్ బుక్ (డైరీ)లో సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక సందేశాన్ని రాశారు. సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన అసమాన పోరాటం యావత్ ప్రపంచానికి నిరంతర స్ఫూర్తినిస్తుంది. పేదలు, అణచివేతకు గురైన వర్గాల సాధికారత కోసం ఆయన చూపిన మార్గం కాలపరీక్షకు నిలబడింది. లండన్‌లో ఆయన జ్ఞాన సాధన చేసిన ఈ చారిత్రక స్థలాన్ని తాకడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని తన సందేశంలో పేర్కొన్నారు.

అంబేడ్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉన్నాం:

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందాలనే లక్ష్యంతోనే తమ సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా భారతీయులకు ఈ నివాసం ఒక ప్రేరణాత్మక తీర్థక్షేత్రం లాంటిదని కొనియాడారు. ఈ సందర్శనలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ మూడు రోజుల లండన్ పర్యటన విజయవంతంగా ముగిసి, హైదరాబాద్ తిరిగి రాకతో విదేశీ వర్సిటీలతో భాగస్వామ్య ప్రక్రియలు వేగవంతం కానున్నాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us