కేసీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఎంక్వైరీ జడ్జిని మార్చాలన్న ధర్మాసనం

|

Jul 16, 2024 | 1:49 PM

విద్యుత్‌ కొనుగోళ్లపై జుడీషియల్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే, విచారణలో కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. విచారణ జరుగుతుండగానే.. జూన్ 11న కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ నర్సింహా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఎంక్వైరీ జడ్జిని మార్చాలన్న ధర్మాసనం
Supreme Court
Follow us on

విద్యుత్‌ కొనుగోళ్లపై జుడీషియల్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే, విచారణలో కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. విచారణ జరుగుతుండగానే.. జూన్ 11న కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ నర్సింహా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషన్ విచారణ ఇంకా పూర్తికాక ముందే, కమిషన్‌ తన అభిప్రాయం చెప్పడం కరెక్టు కాదంది సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

విచారణ పూర్తికాక ముందే జస్టిస్‌ నర్సింహారెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చేశారన్నారు సీజేఐ. కమిషన్ జడ్జిని మార్చే అవకాశం ఇస్తున్నామని సీజేఐ తెలిపారు. నోటీసు ఇవ్వడం కోసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, జడ్జి స్వయంగా మీడియాను అడ్రస్ చేయాల్సిన అవసరం లేదన్నారు చీఫ్ జస్టిస్. కమిషన్ జడ్జి కేసులోని మెరిట్స్ గురించి మాట్లాడకపోతే, తాము కూడా వదిలేసేవాళ్లమన్నారు. ఎంక్వైరీ రిపోర్ట్ ఓ వ్యక్తి ప్రతిష్టను ప్రభావితం చేస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

అయితే, సీజేఐ వ్యాఖ్యలతో విభేదించారు ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వీ. ఇప్పటికే కొన్ని నెలల పాటు విచారణ జరిగిందని, కొత్త జడ్జిని ఏర్పాటు చేస్తే మళ్లీ మొదటికి వస్తుందన్నారు. మరోవైపు, కేసీఆర్‌ తరపున లాయర్‌ ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం మారిన ప్రతిసారీ మాజీ సీఎంలపై కేసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిందని, అందుకే ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం జరిగిందనన్నారు. దానికి రెండు రాష్ట్రాలూ ఆమోదించాయని కోర్టుకు తెలిపారు రోహత్గి.

అలాగే, భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ BHELకే అప్పగించారని, అన్ని కాంట్రాక్టులూ ప్రభుత్వాలతో, ప్రభుత్వరంగ సంస్థలోనే ఉన్నప్పుడు తప్పేముందని కోర్టుకు విన్నవించారు న్యాయవాది రోహత్గి. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉండగా.. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ కట్టారని ప్రశ్నిస్తున్నారన్నారు. ఇలా ఎందుకు కట్టారన్నది విచారణ జరపాల్సిన అంశమా? అంటూ ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు లాయర్‌ రోహత్గి. రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఒకదాన్ని ఎంచుకోవడం తప్పెలా అవుతుందన్నారు.

రాష్ట్రప్రభుత్వం తరపున సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇదేమీ కేసీఆర్ కు వ్యతిరేకంగా వేసిన కమిషన్ కాదని సింఘ్వీ పేర్కొన్నారు. ఇందులో చాలామంది ఇతర వ్యక్తులు కూడా ఉన్నారన్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో రెండేళ్లలో పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం జరపవచ్చని, తద్వారా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించవచ్చని బదులిచ్చారు సింఘ్వీ. మరి, ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఏడేళ్లు ఎందుకు పట్టింది? అని సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాజెక్టుతో ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉందన్నారు సింఘ్వీ. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కాలుష్యం ఎక్కువ ఉండడమే కాదు, ఆర్థికంగా కూడా నష్టమేనని నిపుణుల నివేదికలు ఉన్నాయని సింఘ్వీ సుప్రీంకోర్టుకు నివేదించారు. ఇదే అంశంపై మాజీ సీఎంకు జూన్‌15 దాకా గడువునిస్తూ, ఏప్రిల్‌లో కమిషన్‌ నోటీసులు ఇచ్చిందని సింఘ్వీ గుర్తు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..