KA Paul: కేఏ పాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..ఆ విషయంలో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం

|

Apr 10, 2023 | 1:30 PM

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఇటీవల తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాద ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

KA Paul: కేఏ పాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..ఆ విషయంలో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం
Ka Paul
Follow us on

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఇటీవల తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాద ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన వేసిన పిటీషిన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. అగ్నిప్రమాద ఘటనలపై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పేసింది. సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, నరబలి అని కేఏ పాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. తన కేసులో తానే స్వయంగా వాదనలు వినిపించారు.

దేశంలో జరిగే అగ్నిప్రమాదాలపై సీబీఐతో విచారణ జరపమని ఆదేశించాలా అంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేఏ పాల్ దాఖలు చేసిన పిటీషన్ ను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..