AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..?

హైదరాబాద్‌లో భారీ హైప్‌తో జరిగిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్తా ఊహించని రచ్చకు దారితీసింది. అభిమానుల తాకిడితో గ్రౌండ్ దద్దరిల్లగా.. పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది. పలువురు గాయపడటంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాలేజీ మేనేజ్‌మెంట్ సహా మూవీ యూనిట్‌పై కేసులు నమోదు చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..?
Toxic Movie Pre Release Event Stampede
Krishna S
| Edited By: |

Updated on: Aug 25, 2026 | 5:42 PM

Share

పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్‌తో వస్తున్న టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్తా ఊహించని వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ శివారులోని మల్లారెడ్డి కాలేజీ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో ఒక్కసారిగా అదుపుతప్పిన క్రౌడ్ వల్ల తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. అభిమానుల తాకిడితో గ్రౌండ్ మొత్తం గందరగోళంగా మారడమే కాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రచ్చపై సీరియస్ అయిన పేట్ బషీరాబాద్ పోలీసులు మూవీ యూనిట్‌తో పాటు కాలేజీ మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది?

సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ వల్ల అనుకున్న దానికంటే పదింతలు జనం గ్రౌండ్‌కు పోటెత్తారు. పాసులు ఉన్నవారితో పాటు వేలాది మంది ఫ్యాన్స్ ఒకేసారి ఎంట్రీ గేట్ల వద్దకు దూసుకురావడంతో వాతావరణం వేడెక్కింది. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని కంట్రోల్ చేయడంలో ఈవెంట్ సెక్యూరిటీ చేతులెత్తేసింది. బారికేడ్లు తోసుకుంటూ జనం లోపలికి చొచ్చుకెళ్లడంతో భారీ తోపులాట జరిగింది. అరుపులు, కేకల మధ్య ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో పలువురు కిందపడిపోయారు. ఊపిరాడక, గాయాలతో స్పృహతప్పి పడిపోయిన వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.

పోలీసుల యాక్షన్.. FIR నమోదు

జనసందోహాన్ని సరిగ్గా అంచనా వేయకుండా, సరైన సేఫ్టీ మెజర్స్‌ పాటించకుండా ఈవెంట్ ప్లాన్ చేశారంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేట్ బషీరాబాద్ పీఎస్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈవెంట్ మేనేజ్‌మెంట్, గ్రౌండ్ ఇచ్చిన మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం, రూల్స్ బ్రేక్ చేసిన టాక్సిక్ మూవీ యూనిట్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Follow Us