Viral Video: ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి.. ఇదిగో వీడియో!

ఆర్డర్ చేసిన ఫుడ్ లేట్‌గా తీసుకొచ్చాడనే కారణంతో ఓ జొమాటో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తలు విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ పరిధిలోని వాసవి నగర్‌లో చోటుచేసుకుంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయి వైరల్ అవ్వడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి.. ఇదిగో వీడియో!
Zomato Delivery Boy Assaulted

Updated on: Oct 04, 2026 | 6:12 PM

ఫుడ్ డెలివరీలో ఆలస్యమైందని ఓ డెలివరీ బాయ్‌పై భార్యభర్తలు దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని వాసవి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి.. ఫుడ్‌ ఆర్డర్ చేశాడు. అయితే.. ఆ ఆర్డర్ పిక్ చేసుకున్న ఆశీష్‌ అనే డెలివరీ బాయ్.. లోకేషన్‌కు బయల్దేరాడు. అయితే యాప్‌లో లొకేషన్ తప్పుగా చూపించడంతో ఆర్డర్‌ను కాస్త ఆలస్యంగా డెలివరీ చేశాడు ఆశీష్‌. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కస్టమర్, ఆశిష్‌తో వాగ్వాదానికి దిగాడు. మాటమాట పెరగడంతో బాక్సర్ అయిన ఆ కస్టమర్ డెలివరీ బాయ్‌పై దాడి చేశాడు. అనంతరం అతని భార్య కూడా చేతితో డెలివరీ బాయ్ తలపై బలంగా కొట్టింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

కార్ఖానా పోలీసుల తీరుపై విమర్శలు

అయితే సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేవలం పెట్టి కేసు నమోదు చేవారు. అయితే ఈ ఘటనపై సికింద్రాబాద్ కార్ఖానా పోలీసుల వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు దారితీసింది. కేసు నమోదు చేయడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని డెలివరీ బాయ్స్ ఆరోపిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారాలు ఉన్నప్పటికీ, న్యాయం చేయాలని కోరిన బస్తీవాసులు, డెలివరీ బాయ్స్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు.

మా డ్యూటీ కూడా మీరే చేస్తారా అంటూ వార్నింగ్ ఇవ్వడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన భార్యాభర్తలలో కేవలం భర్తపై మాత్రమే కేసు నమోదు చేసి, భార్యను వదిలిపెట్టారని వారు ఆరోపించారు. డెలివరీకి వెళ్లిన ఆశిష్‌పై తీవ్రస్థాయిలో దాడి జరిగితే పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దాడి చేసిన అజయ్, లక్ష్మి ఇద్దరిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us