AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Formula E race in Hyderabad: ఫిబ్రవరి 11న ఫార్ములా ఇ-రేసింగ్.. హైదరాబాద్‌ చేరుకున్న రేసింగ్ కార్లు..

ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ హైదరాబాద్‌కు చేరుకుంది. దేశంలోనే మొట్టమొదటి ఈ-ప్రిక్స్‌ను నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను నిర్వహించడంలో..

Formula E race in Hyderabad: ఫిబ్రవరి 11న ఫార్ములా ఇ-రేసింగ్.. హైదరాబాద్‌ చేరుకున్న రేసింగ్ కార్లు..
Formula E Race
Shiva Prajapati
|

Updated on: Feb 03, 2023 | 9:27 AM

Share

ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ హైదరాబాద్‌కు చేరుకుంది. దేశంలోనే మొట్టమొదటి ఈ-ప్రిక్స్‌ను నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను నిర్వహించడంలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో బృందం కీలక పాత్ర పోషించింది.

దేశంలోనే మొట్టమొదటిసారి హైద్రాబాద్‌లో జరుగుతున్నా ఫార్ములా ఈ రేసు నిర్వహించడంలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో బృందం కీలక పాత్ర పోషించింది. బుధవారం విమానాశ్రయంలోని కార్గో విభాగానికి 90 టన్నుల రేసింగ్ కార్ల భాగాలు చేరుకున్నాయి. బుధవారం రాత్రి 11.50 గంటలకు రియాద్ నుంచి బోయింగ్ 747-400 చార్టర్ విమానం ద్వారా ఆటో విడిభాగాలు శంషాబాద్ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్‌కు చేరుకున్నాయి. మరో రెండు విమానాలలో మిగతా రేసింగ్ కార్ల భాగాలు హైదరాబాద్ చేరుకోనున్నాయి. నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి గ్లోబల్ మోటార్‌స్పోర్ట్, ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 11 జట్లు పోటీ పడుతున్నాయి.

ఆటో విడిభాగాలకు చెందిన 83 బాక్స్‌లతో కూడిన కార్గో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్లాట్ల వద్ద నిలిపిన విమానం నుండి ఆఫ్‌లోడ్ చేసారు. వాటిని అన్‌లోడింగ్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన కార్గో హ్యాండ్లింగ్ పరికరాలను ఉపయోగించి జీహెచ్ఏఆర్ టెర్మినల్‌లోపలికి తరలించారు. ఇ-ఫార్ములా బృందానికి సహాయం చేయడానికి, షిప్‌మెంట్ ప్రక్రియ సమర్థవంతమైన నిర్వహణ కోసం హైదరాబాద్ కార్గో వారు ఒక మల్టీ-స్టేక్‌హోల్డర్ క్రాక్ టీమ్ ఏర్పాటు చేసారు. దేశంలో మొట్టమొదటి ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ కోసం నిరాటంకమైన ఎయిర్ కార్గో సదుపాయాలను అందించడంలో హైదరాబాద్ విమానాశ్రయం పాత్ర పోషించడం గర్వంగా ఉందన్నారు ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ పణికర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
53 ఏళ్ల వయసులో ఫిట్నెస్ సీక్రెట్.. ప్రభుదేవా రోజూ ఏం చేస్తారంటే..
53 ఏళ్ల వయసులో ఫిట్నెస్ సీక్రెట్.. ప్రభుదేవా రోజూ ఏం చేస్తారంటే..
భారీ గ్రహం రాకతో ఈ రాశుల వారిపై కనకవర్షం.. మీ రాశి ఉందా?
భారీ గ్రహం రాకతో ఈ రాశుల వారిపై కనకవర్షం.. మీ రాశి ఉందా?
షుగర్, బీపీ, బరువు కంట్రోల్ అవ్వాలన్నా పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!
షుగర్, బీపీ, బరువు కంట్రోల్ అవ్వాలన్నా పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!
ఇంట్లోనే చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా ఉసిరికాయలు..
ఇంట్లోనే చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా ఉసిరికాయలు..
పదో తరగతి 2027 పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
పదో తరగతి 2027 పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
లైంగిక ఆరోపణలతో DRDO ఉద్యోగిపై దాడి.. హాస్పిటల్‌కు తరలించేలోపే..
లైంగిక ఆరోపణలతో DRDO ఉద్యోగిపై దాడి.. హాస్పిటల్‌కు తరలించేలోపే..
మనిషి ఎత్తు నిటారుగా నిలబడగలదు.. కింగ్ కోబ్రా గురించి..
మనిషి ఎత్తు నిటారుగా నిలబడగలదు.. కింగ్ కోబ్రా గురించి..
వింత ఘటన.. నోటిలో పెరగాల్సిన పన్ను కంటి పైన..!
వింత ఘటన.. నోటిలో పెరగాల్సిన పన్ను కంటి పైన..!
ఎర్ర రాయిని నీలి రంగు సముద్రంలో వేస్తే ఏమవుతుంది?.. UPSC ప్రశ్న
ఎర్ర రాయిని నీలి రంగు సముద్రంలో వేస్తే ఏమవుతుంది?.. UPSC ప్రశ్న
పిల్లలకు జన్మనిచ్చేది తండ్రే! ఈ జీవి గురించి మీకు తెలుసా..?
పిల్లలకు జన్మనిచ్చేది తండ్రే! ఈ జీవి గురించి మీకు తెలుసా..?