చదువు చెప్పాలి.. తప్పు చేస్తే.. కాస్త గట్టిగా భయం చెప్పాలి. అంతేకానీ ఇలా పశువులను బాదినట్లు బాదితారా..? సిద్దిపేట – కొండపాక మండలం దుద్దెడలోని గురుకుల పాఠశాలలో చదువతున్న 30 మంది ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులు.. ఉదయం వేళ నిర్వహించిన ప్రత్యేక స్టడీ అవర్స్‌కు వివిధ కారణాల వల్ల ఆలస్యంగా వచ్చారు. దీంతో తన మాట వినలేదని ఫిజికల్ డైరెక్టర్ వాసు చెలరేగిపోయాడు. కర్రతో స్టూడెంట్స్‌ను చితకబాదాడు. ఒళ్లంతా వాతలు తేలడంతో.. తరగతిలో కూర్చోవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. తీవ్రంగా గాయపడిన కొందరిని సిద్దిపేటలోని ఒక ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం అందుతోంది.
ఫిజికల్ డైరెక్టర్ దాడిలో గాయపడిన మరో విద్యార్థి హర్షవర్ధన్ హైదరాబాద్లోని రామంతాపూర్‌లో నివాసం ఉంటున్న తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో.. వారు పాఠశాలకు చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. కేవలం స్టడీ అవర్‌కు లేట్ వచ్చారని ఇలా దాడి చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డలు సరిగ్గా చదవకపోతే సమాచారం ఇస్తే.. తాము మంచి చెబుతామని కానీ ఇలా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఫిజికల్ డైరెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేరెంట్స్ ఆందోళలను దిగారు.. విద్యార్థులను చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్‌ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
విద్యార్థుల మధ్య చదువులో కాంపిటేషన్ వచ్చేలా చేయాలి.. టాపర్స్‌గా నిలిచినవారికి బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్స్ అందజేయాలి.. సులవైన, సరమైన పద్దతుల్లో విద్యాభోదన చేయాలి. అప్పుడు.. స్టూడెంట్స్ పోటీతత్వంతో చదువుల్లో పోటీపడతారు. అంతేకానీ ఇలా దండిస్తే ఏ మాత్రం ఉపయోగం ఉండదని విద్యావేత్తలు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.