Janasena: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కనిపించని పవన్.. రీజన్..?

|

Nov 15, 2023 | 5:21 PM

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో సభలో పాల్గొనడం తప్పితే.. జనసేనకు కేటాయించిన సీట్లలో ఇప్పటిదాకా ప్రచారానికి వెళ్లలేదు పవన్‌ కల్యాణ్. అటు మిత్రపక్షం బీజేపీ తరఫున కూడా ఆయన క్యాంపెయిన్‌ చెయ్యడం లేదు. రీజన్ ఏంటి అన్నది అంతుబట్టడం లేదు.

Janasena: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కనిపించని పవన్.. రీజన్..?
Pawan Kalyan
Follow us on

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్‌ కల్యాణ్‌ కనిపించుట లేదు. వినిపించుట లేదు. పవన్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీనే కాదు…..జనసేన కేడర్‌ కూడా ఇదే ప్రశ్న అడుగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించింది బీజేపీ. కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, ఖమ్మం, నాగర్‌కర్నూలు, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట స్థానాలను జనసేనకు కేటాయించింది బీజేపీ. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో సభలో పాల్గొనడం తప్పితే.. జనసేనకు కేటాయించిన సీట్లలో ఇప్పటిదాకా ప్రచారానికి వెళ్లలేదు పవన్‌ కల్యాణ్. అటు మిత్రపక్షం బీజేపీ తరఫున కూడా ఆయన క్యాంపెయిన్‌ చెయ్యడం లేదు. మరో 13 రోజుల్లో ఎన్నికల ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ కూడా పడనుంది. అయితే పవన్‌ అసలు ప్రచారానికి వెళతారా లేదా అనేదానిపై సస్పెన్స్‌ నెలకొంది.

పొత్తులో భాగంగా సీట్లు దక్కించుకున్న జనసేన అభ్యర్థులు

  • కూకట్‌పల్లి- ముమ్మారెడ్డి ప్రేమ్‌ కుమార్‌
  • కోదాడ- మేకల సతీష్‌రెడ్డి
  • తాండూరు- నేమూరి శంకర్‌గౌడ్‌
  • ఖమ్మం- మిర్యాల రామకృష్ణ
  • కొత్తగూడెం- లక్కినేని సురేందర్‌రావు
  • అశ్వారావుపేట(ఎస్టీ)- ముయబోయిన ఉమాదేవి
  • వైరా(ఎస్టీ)- డా.తేజావత్‌ సంపత్‌ నాయక్‌
  • నాగర్‌ కర్నూల్‌- వంగల లక్ష్మణ్ గౌడ్‌

జనసేన పార్టీ పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. 32 సీట్లకు తాము పోటీ చేయబోతున్నట్లు మొదట ప్రకటించినా.. బీజేపీతో చర్చల తరువాత 8 మంది అభ్యర్ధులను అనౌన్స్‌ చేశారు పవన్ కల్యాణ్. అంటే పోటీ చేసే స్థానాలను నాలుగో వంతుకు కుదించుకున్నారు. టికెట్ల వారీగా చూస్తే.. ఉమ్మ‌డి ఖమ్మం జిల్లాలో నాలుగు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు జ‌న‌సేనకు ద‌క్కాయి. టికెట్లు ఎవరికి దక్కాయన్నది పక్కనపెడితే… కనీసం ఒకట్రెండు స్థానాల్లో అయినా జనసేన గెలవాల్సి ఉంటుంది. కూకట్‌పల్లి, ఖమ్మం వంటి కీలక స్థానాలను దక్కించుకోవడమే ఇందుకు కారణం. జనసేనతో పెట్టుకుని నష్టపోయామని బీజేపీ అనుకోకుండా ఉండాలంటే సత్తా చాటాల్సిందే. పైగా ఈ ప్రభావం ఏపీ జనసేన పైనా పడుతుంది. మరి.. తొలిసారి తెలంగాణలో పోటీ చేస్తున్న జనసేన ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..