Telangana: అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!

| Edited By: Ravi Kiran

Dec 26, 2024 | 7:45 PM

ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా.. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళుతుంటాం. ఆ రూట్ తెలిసినా.. తెలియకపోయినా గూగుల్ మ్యాప్‌నే ఎక్కువగా నమ్ముకుని ప్రయాణం చేస్తుంటాం. అయితే ఇది ఖచ్చితమైన అడ్రస్, రూట్‌లోకి తీసుకువెళుతుందా..? మరి ఇంతకీ ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
Bhadrachalam
Follow us on

గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకుని భక్తులు ముప్పుతిప్పలు పడ్డారు. కొన్ని సందర్భాల్లో రాంగ్ రూట్, అడ్రస్‌లోకి తీసుకువెళుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వెళ్ళాల్సిన రూట్ కాకుండా ఎటో తీసుకుపోతోంది. అనేక ఇబ్బందులు పడుతున్నారు. అచ్చం గూగుల్ మ్యాప్‌నే నమ్ముకోవద్దని సలహా ఇస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ పుణ్య క్షేత్రమైన భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులకు గూగుల్ మ్యాప్స్ ముప్పు తిప్పలు పెట్టింది. భద్రాద్రి రామయ్యకు మొక్కులు తీర్చేందుకు విజయనగరం నుంచి బస్సులో వచ్చిన రామ భక్తులు.. రామాలయంకు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు. మ్యాప్‌లో చూపిన విధంగా డ్రైవర్ వెళ్లాడు.. తీరా చూస్తే రాంగ్ రూట్‌లోకి వెళ్లి రాజవీది జంక్షన్‌లో బస్సు ఇరుక్కుపోయింది. ఇది ఇరుకుగా ఉండే రహదారి. ఈ ఇరుకు రోడ్‌లో పెద్ద బస్సు ఇరుక్కుపోయింది.

భక్తులు భయాందోళనకు గురయ్యారు. గంటల తరబడి బస్సును తీసే ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో రామయ్యా మమ్మల్ని కనవయ్యా.! అంటూ రామ భక్తులు తిప్పలు అన్నీ ఇన్నీ కావు. బస్సును తీసే ప్రయత్నించి భక్తులు విసిగి వేశారి చివరికి ఆ వీధిలోని ఇళ్ల మెట్లపై కూర్చోవడమే వారి పనైంది. చివరికి స్థానికులు సాయంతో కొన్ని గంటల తర్వాత బస్సును తీయడంతో భక్తులు రామయ్య దర్శనానికి వెళ్తూ గూగుల్ మ్యాప్స్‌కి ఓ దండం అంటూ వెళ్లిపోయారు.

ఇది చదవండి: డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన వ్యక్తి.. గుమ్మం దగ్గర కనిపించింది చూడగా

ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి