’12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం’.. మాజీ మంత్రి కేటీఆర్..

|

May 06, 2024 | 8:26 AM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. దీంతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా హీటెక్కిస్తోంది. నేతల మధ్య హాట్ హాట్‌గా విమర్శలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ హామీలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 తమ అకౌంట్లో వేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.

12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం.. మాజీ మంత్రి కేటీఆర్..
Ktr
Follow us on

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. దీంతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా హీటెక్కిస్తోంది. నేతల మధ్య హాట్ హాట్‌గా విమర్శలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ హామీలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 తమ అకౌంట్లో వేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కోట్ చేస్తూ.. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ వేశారు. ‘ఎక్కడ ఇస్తున్నారు నెలకు రూ.2,500 చుపిస్తావా.. మరీ ఇన్ని పచ్చి అబద్ధాలా?’ తెలంగాణాలో ఉన్న 1.67 కోట్ల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు అంటూ రాహుల్ గాంధీ వీడియోను కూడా జత చేస్తూ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తానని మాట చెప్పి తప్పినందుకు కాంగ్రెస్‌ను బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలేనన్నారు కేటీఆర్. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యమైందని విమర్శిచారు. కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కళ్యాణ‌లక్ష్మి నిలిచింది, తులం బంగారం అడ్రస్ లేదని ఎద్దేవా చేశారు. ఫ్రీ బస్సు కూడా ఓ బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్ధాలు చేసే దుస్థితి అంటూ ఆరోపించారు కేటీఆర్. అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్‌కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని.. అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదంటూ అందరికీ తెలిసిపోయిందంటూ ట్వీట్టర్ వేదికగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఉప్పల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మనప్పటికీ.. జిల్లాల్లో కాంగ్రెస్ హామీలకు జనం మోసపోయారని విమర్శించారు కేటీఆర్. ఇప్పుటికైనా పోయిందేమీ లేదు..12 ఎంపీ స్థానాలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాన్నారు కేటీఆర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..