హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్ర చేపట్టిన కిషన్ రెడ్డి

నషా ముక్త్ భారత్‌ మన లక్ష్యం.. యువతను మత్తు నుంచి బయటపడేద్దాం.. అనే నినాదం వినిపిస్తోంది దేశంలో. 2029 నాటికి డ్రగ్ ఫ్రీ ఇండియా నిర్మాణమే టార్గెట్‌గా కేంద్రసర్కార్ సంకల్పించింది. దానికి అనుగుణంగా హైదరాబాద్‌లో పాదయాత్ర చేపట్టారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ..

హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్ర చేపట్టిన కిషన్ రెడ్డి
Kishan Reddy

Updated on: Nov 25, 2026 | 9:58 PM

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం.. ప్రధాని మోదీ పిలుపునకు అనుగుణంగా హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ పాదయాత్ర చేపట్టారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై పాదయాత్ర.. చే నెంబర్ చౌరస్తా, ఓయూ ఎంట్రన్స్ గేట్, ఆర్ట్స్ కాలేజ్, సీతాఫల్ మండి చౌరస్తా, చిలకలగూడ క్రాస్ రోడ్ మీదుగా ముషీరాబాద్ చౌరస్తా వరకు చేరుకుంది.

మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎంపీ లక్ష్మణ్, BJP తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు, సినీహీరో వెంకటేష్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు.. నషా ముక్త్ భారత్ పాదయాత్రలో పాల్గొన్నారు. కొన్ని విచ్ఛిన్నకర శక్తులు డ్రగ్స్ ఇచ్చి యువతను తప్పుదారి పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. నషా ముక్త్ భారత్‌లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

పిల్లలను విద్యాలయాలకు పంపే తల్లిదండ్రులు.. అప్రమత్తంగా ఉండాలనీ.. పిల్లల కదలికలను గమనించాలనీ కోరుతున్నారు ఎంపీ లక్ష్మణ్. యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దనీ.. వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకూ ఉందని అన్నారాయన. ప్రతీ పేరెంట్ తమ పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడి డ్రగ్స్‌కి బానిస కాకుండా చూడాలని వెంకటేష్ సూచించారు. డ్రగ్స్ బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ యువతను కోరారు వెంకటేష్.

హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్ర.. రెండో రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ చౌరస్తా, హిమాయత్ నగర్ చౌరస్తా, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, ఖైరతాబాద్ చౌరస్తా, పంజాగుట్ట జంక్షన్ మీదుగా సత్యం థియేటర్ దగ్గరకు చేరుకుంటుంది. మూడో రోజు యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్, ఇందిరానగర్ చౌరస్తా, బసవతారకం హాస్పిటల్, జగన్నాథస్వామి ఆలయం, ఫిల్మ్ నగర్ మీదుగా జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ వరకు పాదయాత్ర సాగుతుంది. అక్కడ భారీ ముగింపు సభ ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us