ఫలించిన సర్కార్ వ్యూహం.. జూరాల నుంచి నీటి విడుదల.. ఆయకట్టు సాగుకు ఊరట!

Updated on: Sep 23, 2026 | 8:53 AM

వనపర్తి జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టు సాగు కోసం నీటి విడుదల ప్రారంభమైంది. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేశారు. ఇది జూరాల నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఎంతో ఊరటనిచ్చింది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కృష్ణా జలాలపై చర్చల అనంతరం ఈ చర్య తీసుకోవడం శుభపరిణామం.

వనపర్తి జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టు సాగు కోసం నీటి విడుదల ప్రారంభమైంది. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో అధికారులు జూరాల ప్రధాన ఎడమ, కుడి కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయి కృష్ణా జలాలపై చర్చలు జరిపిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది.

ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు సుమారు 2,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఎగువ ప్రాంతాల నుంచి దాదాపు 2,800 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీరు అందించేందుకు అధికారులు నీటిని కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us