AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPS Vasundhara Yadav: మేడారంలో మెరిసిన డైనమిక్ ఐపీఎస్ మేడం..! బ్యాగ్రౌండ్ మాత్రం యమ పవర్‌ఫుల్..

మేడారం జాతర ముగిసింది.. అయితే.. అందం.. అభినయం.. నిబద్ధతతో ఓ మహిళా ఐపీఎస్ అధికారిని నెట్టింట వైరల్ గా మారింది. జాతరలో ఆమె ఎందుకలా హైలెట్ అయ్యారు. ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ గా మారిన ఆ మహిళ ఐపీఎస్ అధికారిని ఎవరు.. ఆమె ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు..! అని.. నిటిజన్లు సెర్చ్ చేస్తున్న ఆ లేడీ సింగం ఫుల్ డిటైల్స్ మీరే చూడండి..

IPS Vasundhara Yadav: మేడారంలో మెరిసిన డైనమిక్ ఐపీఎస్ మేడం..! బ్యాగ్రౌండ్ మాత్రం యమ పవర్‌ఫుల్..
Ips Officer Vasundhara Yadav
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Feb 03, 2026 | 4:20 PM

Share

ప్రతి మేడారం జాతరలో కొత్త కొత్త ఐపీఎస్ అధికారులకు డ్యూటీస్ వేస్తుంటారు.. మాస్ గ్యాదరింగ్ సమయంలో క్రౌడ్ కంట్రోల్ ఎలా చేయాలి. ఎప్పటికప్పుడు ఎలాంటి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలపై ఐపీఎస్ లకు మేడారం జాతరను ఒక లెస్సన్ గా పోలీస్ శాఖ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి మేడారం జాతరకు కొత్త ఐపిఎస్ అధికారులు విధులు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. ఎప్పటిలాగే ఈసారి జాతరలో కూడా కొత్తకొత్త ఐపీఎస్ అధికారులు విధులు నిర్వహించారు.. గద్దెల ప్రాంగణం, బస్టాండ్, జంపన్నవాగు, ట్రాఫిక్ జామ్ సమయంలో వివిధ ప్రాంతాల్లో ఐదు రోజులపాటు చెమటోడ్చారు.

అయితే, ఐపీఎస్ అధికారులలో వసుంధర యాదవ్ అనే మహిళ ఐపీఎస్ అధికారిని హాట్ టాపిక్‌గా మారారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం వసుంధర యాదవ్ రీల్స్ వైరల్ అవ్వడంతో ఆమె గురించి చర్చిస్తున్నారు. క్యూలైన్ల వద్ద తోపులాటకు దారి తీసిన సమయంలో ఆమె అనుసరించిన తీరు, ప్రాణం నష్టం జరుగకుండా భక్తులను కంట్రోల్ చేయడం.. ఇలా మొత్తం కర్తవ్యం సినిమాలో విజయశాంతిని మరిపించేలా వ్యవహరించిన ఆమె విధులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా.. ఆమె మంత్రులు, పోలీసులతో కలిసి వేసిన నృత్యం.. హైలెట్ గా నిలిచింది.

మేడారం వచ్చిన ప్రతి భక్తులు ఆమెలో లేడీస్ సింగం ను చూసామని పోస్ట్ చేయడం.. ఆమెను సెల్ ఫోన్లలో స్పందించడం ఇప్పుడు హాట్ హాట్ చర్చగా మారింది. అంతటితో ఆగలేదు అసలు ఆమె ఎవరూ..! ఈ మహిళా అధికారిని ఏ రాష్ట్రానికి చెందిన అధికారిని..! ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారని ఆమె గురించి ఆరా తీయడం మొదలు పెట్టారట..

వీడియో చూడండి..

వసుంధర యాదవ్ బ్యాగ్రౌండ్ ఇదే..

వసుంధర యాదవ్ 2023 బ్యాచ్ కి చెందిన ఐపిఎస్ అధికారిణి.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆజామ్ఘడ్ కు చెందిన వసుంధర యాదవ్.. తన తండ్రి కలను, ఆశయాన్ని నెరవేర్చేందుకు.. పట్టు వదలకుండా IPS అయ్యారు.. 2024 లో తన బ్యాచ్ కు చెందిన IAS అధికారి అజయ్ కుమార్ యాదవ్ ను వివాహం చేసుకున్నారు.

ఈమె భర్త తెలంగాణ క్యాడర్ కు అలాట్మెంట్ అవ్వడంతో వసుంధర యాదవ్ కూడా.. తెలంగాణ క్యాడర్ కు అలాట్మెంట్ అయ్యారు.. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీపీ) గా విధులు నిర్వహిస్తున్నారు.

మేడారం జాతరలో సమర్థవంతంగా విధులు నిర్వహించడంతోపాటు సమ్మక్క, సారలమ్మని తీసుకొచ్చే సమయంలో ఆమె స్థానిక ఆదివాసీలు, మంత్రి సీతక్కతో కలిసి నృత్యాలు చేయడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇలా.. మొత్తానికి వసుంధర యాదవ్ నెట్టింట వైరల్ గా మారారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మేడారంలో మెరిసిన మేడం..! ఈ ఐపీఎస్ బ్యాగ్రౌండ్ మాత్రం యమ పవర్‌ఫుల్
మేడారంలో మెరిసిన మేడం..! ఈ ఐపీఎస్ బ్యాగ్రౌండ్ మాత్రం యమ పవర్‌ఫుల్
ఆమె వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా..
ఆమె వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా..
మీరు ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? షాంపు వాడితే ఏది బెటర్..?
మీరు ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? షాంపు వాడితే ఏది బెటర్..?
సంజూ కెరీర్ క్లైమాక్స్..ఇది మిస్సయితే నిన్ను ఎవరూ కాపాడలేరు
సంజూ కెరీర్ క్లైమాక్స్..ఇది మిస్సయితే నిన్ను ఎవరూ కాపాడలేరు
నిమ్మకాయ పులిహోర ఇలా చేస్తే రెస్టారెంట్ లెవల్‌లో ఉంటుంది!
నిమ్మకాయ పులిహోర ఇలా చేస్తే రెస్టారెంట్ లెవల్‌లో ఉంటుంది!
నోరూరించే పల్లీ చట్నీ ఇలా చేస్తే.. ఒక్క మెతుకు కూడా వదలరు!
నోరూరించే పల్లీ చట్నీ ఇలా చేస్తే.. ఒక్క మెతుకు కూడా వదలరు!
M అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..?
M అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..?
ఇస్లాం మతం నుంచి ఆమెను బహిష్కరించారా.?
ఇస్లాం మతం నుంచి ఆమెను బహిష్కరించారా.?
ఐ బాల్ టాటూ... నిజంగా నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది బ్రదర్..
ఐ బాల్ టాటూ... నిజంగా నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది బ్రదర్..
ఫిబ్రవరిలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 7 ప్రదేశాలు మీ కోసమే!
ఫిబ్రవరిలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 7 ప్రదేశాలు మీ కోసమే!