తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పది కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ అమెరికా పర్యటన ద్వారా వచ్చే పెట్టుబడులతో..రాష్ట్ర ఇమేజ్ రెట్టింపు అవుతుందని అధికారులు ప్రకటించారు.
ఆగస్ట్ 3వ తేదీ నుండి అమెరికా పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకరావడమే లక్ష్యంగా సాగుతోంది. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి సీఎం రేవంత్, అమెరికాలో వివిధ కంపనీలతో MOU కుదుర్చుకున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై విపక్ష పార్టీ బీఆర్ఎస్ తప్పుబడుతోంది. ఇదంతా కేవలం తమ కుటుంబం కోసం ఒప్పందాలు చేసుకోవడానికి అమెరికా పర్యటన చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అమెరికా రిటర్న్స్ చేపట్టిన రేవంత్ రెడ్డి ఆగస్ట్ 13 వరకు అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుందని ప్రభుత్వం నుండి మంత్రులు అదే విధంగా పార్టీ పెద్దలు పదేపదే చెబుతున్నారు. ఈనెల మూడు నుండి అమెరికా పర్యటన చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పటివరకు పది కంపెనీల తో 16 ఒప్పందాలు జరిగాయని అధికారులు ప్రకటించారు. దీంతో పాటు కాగ్నిజెంట్ అనే అతి పెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రానికి 15 వేల ఉద్యోగ ఉపాధి దొరికే అవకాశం ఉంది.
తెలంగాణ స్టార్ట్ అప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలని వాల్చర్ కూలింగ్ సంస్థ భావిస్తోంది. అదేవిధంగా ఆర్సీయం సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా 500 ఉద్యోగాలు లభిస్తాయి. మరొవైపు స్వచ్ఛ బయోటెక్ సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది, దీంతో స్వచ్ఛందంగా ఐదు వందల ఉద్యోగాలు రానున్నాయి. మరో సంస్థ అర్టీఫిషియల్ ఇంటలిజెన్స్, ఎచ్‌సీఎల్ లాంటి సంస్థలు రాష్ట్రానికి రానున్నాయి.
ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నామని కుండబద్దలు కొట్టి చెబుతోంది కాంగ్రెస్, ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు నిజమైతే తెలంగాణ మరింత అభివృద్ధి చెందడంతోపాటు పెద్ద మొత్తంలో కూడా ఉద్యోగం అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
ఇక తాజాగా దిగ్గజ ఫార్మా కంపెనీ AMGENను సందర్శించారు సీఎం రేవంత్ బృందం. హైదరాబాద్‌లో కొత్త సైట్‌ను ప్రారంభించేందుకు AMGEN సుముఖత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. హైటెక్ సిటీలో AMGEN ఇండియా కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. దీంతో 3వేల మందికి ఉపాధి లభించనుంది.
అమెరికా పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి గూగుల్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. తెలంగాణలో గూగుల్ పెట్టుబడులకు సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించనున్నారు. తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోని బయోడిజైన్ సెంటర్ కు వెళతారు. ఆ తర్వాత ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..