Telangana: ఆవులంటే ఎనలేని అభిమానం.. పాలు పితకరు.. అమ్మరు.. ఈ బామ్మకు సెల్యూట్ చేయాల్సిందే..

| Edited By: Janardhan Veluru

Nov 05, 2022 | 5:01 PM

హిందూ సంప్రదాయంలో గోవులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవులను దేవతా స్వరూపంగా భావించి పూజలు చేసే వారూ ఉన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మదన్‌లాల్, బదాంబాయి దంపతులు నివాసముంటున్నారు. వారికి గోమాత..

Telangana: ఆవులంటే ఎనలేని అభిమానం.. పాలు పితకరు.. అమ్మరు.. ఈ బామ్మకు సెల్యూట్ చేయాల్సిందే..
Cow Sheds In Kamareddy Late
Follow us on

హిందూ సంప్రదాయంలో గోవులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవులను దేవతా స్వరూపంగా భావించి పూజలు చేసే వారూ ఉన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మదన్‌లాల్, బదాంబాయి దంపతులు నివాసముంటున్నారు. వారికి గోమాత అంటే ఎనలేని అభిమానం. మదన్ లాల్ కామారెడ్డిలో ఎలక్ట్రానిక్స్‌ వ్యాపారం చేస్తు్న్నారు. పిల్లలు పెద్ద వాళ్లయి స్థిరపడుతున్నారు. పరిస్థితులు అనుకూలించడంతో బాదం బాయి తన మనసులోని కోరికను భర్తకు విన్నపించుకుంది. గోశాల పెడదామని భర్తను కోరింది. భార్య కోరికను మదన్ లాల్ కాదనలేకపోయాడు. గోశాల కట్టించేందుకు సిద్ధమయ్యాడు. అందుకోసం 1996లో 44వ నంబరు జాతీయ రహదారిపై జంగంపల్లి వద్ద ప్లాట్ కొనుగోలు చేశారు. అక్కడ గోశాల కట్టి శ్రీ కుమార్‌ పాల్‌ జీవ్‌ దయా ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం 21 ఆవులతో గోశాలను ప్రారంభించారు. ఇలా ఆవులను చూసుకుంటూ.. కుటుంబ అవసరాలు తీరుస్తూ బదాంబాయి ఎంతో ఆనందంగా రోజులు గడిపేసేది. ఈ క్రమంలో చుట్టుపక్కలా గ్రామాల్లో ఎవరైనా ఆవులు అమ్మడానికి తీసుకువెళుతున్నారంటే వాటిని బాదంబాయి కొనుగోలు చేస్తుంటుంది. దేవాలయాల వద్ద ఆవులను పెంచడం భారంగా భావించిన జీవాలనూ ఈ గోశాలకు తీసుకు వస్తుంటారు.

ప్రస్తుతం గోశాలలో ఆవులు, లేగల సంఖ్య 158 కి చేరింది. రోజూ ఉదయాన్నే బదాంబాయి కుమారులు మహేందర్, మహిపాల్‌ లు ఆవులకు అవసరమైన దాణా, గడ్డి వేస్తుంటారు. అమావాస్య రోజున కుటుంబం అంతా గోశాలలోనే గడుపుతారు. అయితే వయసు మీద పడుతుంటడం, అనారోగ్యం కారణంగా ఆవుల బాగోగులు చూసుకోవడం బాదంబాయికి కాస్త ఇబ్బందిగా మారింది. శక్తి ఉన్నన్ని రోజులూ గోవులకు సేవ చేస్తానని, పిల్లలందరూ ఇదే పనిని భక్తిగా చేస్తుంటారని బదాంబాయి ఆనందంతో చెప్పడం విశేషం. 2008 లో బదాంబాయి భర్త మదన్ లాల్ మరణించారు.అయినా ఆమె గో సంరక్షణ మానుకోలేదు.

గోశాలలో ఆవుల పాలు పితకరు. ఎన్ని ఆవులు ఈనినా పాలు లేగలకు వదిలేస్తారు. ఆవులను గానీ, లేగలను గానీ అమ్మనే అమ్మరు. వయస్సు పైబడి చనిపోయే దాకా వాటి సంరక్షణ బదాంబాయి, ఆమె కుటుంబం చూసుకుంటూ ఉంటుంది. ఆవుల కోసం గోశాలలో నాలుగు ఎకరాల్లో గడ్డి పెంపకం చేపట్టారు. ఒక వైపు గడ్డి విత్తనం వేసి మొలకెత్తగానే, మరో పక్కన విత్తనం వేస్తారు. ఈ విధానం వల్ల ఎప్పుడూ గడ్డి అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి