Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తమైన ప్రభుత్వం.. ఎయిర్ పోర్ట్‎లో నిఘా పెంపు..

పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్లను అధికారులు ట్రేస్ చేస్తున్నారు....

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తమైన ప్రభుత్వం.. ఎయిర్ పోర్ట్‎లో నిఘా పెంపు..
Omicron Variant Corona
Follow us

|

Updated on: Dec 03, 2021 | 12:12 PM

పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్లను అధికారులు ట్రేస్ చేస్తున్నారు. నేటి నుండి విదేశాల నుంచి ముఖ్యంగా ఎట్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారి పై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఎయిర్ పోర్ట్‎లో rtpcr పరీక్షలు నిర్వహించి నాలుగు గంటల్లో రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే టీమ్స్ అసుపత్రి కి తరలించి, చికిత్స చేయడానికి ఏర్పాట్లు చేశారు. నెగిటివ్ వస్తే వారం రోజుల పాటు క్వారంటైన్‎లో ఉంచి మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ వస్తే వారి శాంపిల్ కలెక్షన్‎లో 5 శాతం జినోమ్ సీక్వెన్స్ టెస్ట్‎కు పంపుతారు. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారందరి స్వాప్ కలక్షన్ జినోమ్ సీక్వెన్స్‎కు తరలిస్తారు.

బ్రిటన్ నుంచి హైదరాబాద్‎కు వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలున్నట్లు గుర్తించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు గురువారం తెలిపారు. ఆమె శాంపిల్స్‎ను జినోమ్ సీక్వెన్స్‎కు పంపించామని చెప్పారు. విదేశాల నుంచి ఇప్పటి వరకు 325 మంది రాగా అందులో ఈ మహిళకు పాజిటివ్ వచ్చిందని.. ఆమెను టీమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లండించారు. నెగిటివ్ వచ్చిన వారికి వారం రోజుల తరువాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 72 మంది ఏపీకి చెందిన వారు కాగా.. 239 తెలంగాణకు చెందిన వారిగా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.

డిసెంబర్ చివరి వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో గత నాలుగు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 25 దేశాలలో 215 కరోనా ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయన్నారు. ఒమిక్రాన్‎పై జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించిందని తెలిపారు. ఆఫ్రికాలో సరిగ్గా వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లే కొత్త వెరియంట్ పుట్టుకొంచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మందికి మొదటి డోస్ పూర్తి అయిందని పేర్కొన్నారు. 47 శాతం మంది రెండో డోస్ తీసుకున్నారని తెలిపారు.

వాక్సిన్ వేసుకొని వారు ఇప్పటికైనా వాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్, మేడ్చేల్, రంగారెడ్డి జిల్లాలో సెకండ్ డోస్ టైమ్ ఐపోయిన వారు 15 లక్షల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలు మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Read Also.. Omicron effect: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కఠిన ఆంక్షలు.. పకడ్బందీగా స్ర్కీనింగ్‌ పరీక్షలు..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు