విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నేడు బంద్ నిర్వహించనున్నట్లు విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ప్రకటించింది. ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు సొంత భవనాలు.. తదితర డిమాండ్లతో ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు కమిటీ నేతలు ప్రకటించారు. ఈ నిరసనలో ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్వో, టీవీవీ పాల్గొననుండగా.. నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు నిరసన ప్రదర్శన చేస్తామని ఎస్ఎఫ్ఐ కార్యదర్వి కోట రమేష్ పేర్కొన్నారు. కాగా బంద్ నేపథ్యంలో ఇప్పటికే నగరంలోని చాలా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు సెలవు ప్రకటించాయి.