హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బోయినపల్లిలో రూ.8.5 కోట్ల విలువ చేసే ఎనిమిదిన్నర కిలోల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లిలో స్థానిక పోలీసులు,హెచ్ న్యూ టీమ్స్ 8.5 కిలోల ఎమ్ఫిటమిన్ డ్రగ్ పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్‌ను పిల్, లిక్విడ్‌గా వివిధ రూపాల్లో తీసుకుంటారని చెప్పారు. ఎమ్ఫిటమిన్ డ్రగ్‌ను అమ్మాయిలకు కూల్ డ్రింక్స్‌లో కలిపి ఇస్తుంటారన్నారు. మార్కెట్లో ఈ డ్రగ్ ఖరీదు ఒక కేజీ.. కోటి నుంచి కోటిన్నర వరకు ఉంటుందని వివరించారు. గతంలో ఆల్ఫా జోలం సరఫరా కేసులో అరెస్ట్ అయిన అంజిరెడ్డి అనే నిందితుడి శిష్యుడే ఈ కంచెర్ల నాగరాజు అని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు, అంజిరెడ్డిని పిటి వారెంట్ మీద తీసుకొచ్చి విచారిస్తామని సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
నగర యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, పార్టీలకు వెళ్లే యూత్ గుర్తు తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలను కూల్ డ్రింక్స్‌లో కలిపి ఇస్తుంటారు కాబట్టి అలెర్ట్ గా ఉండాలన్నారు. తమ పిల్లలు ఎవరితో పార్టీలకు వెళ్తున్నారో తల్లిదండ్రులు గమనించాలన్నారు. గత రెండు నెలల క్రితం సంగారెడ్డి గుమ్మడిదలలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై TGNAB పోలీసులు దాడులు చేశాసినట్లు సీపీ తెలిపారు. అంజిరెడ్డిని రెండు నెలల క్రితం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్టు కు ముందు అంజి రెడ్డి ఒక 3 డ్రగ్ పాకెట్‌ను నాగరాజు వద్ద దాచినట్లు గుర్తించామన్నారు. అంజిరెడ్డి అరెస్ట్ తరువాత, నాగరాజు డ్రగ్స్‌ను అమ్మేందుకు ప్రయత్నించాడన్నారు.
కాగా, బయట మార్కెట్ కిలో డ్రగ్ 1.5 కోట్ల ఉంటుందని తెలుస్తోందని, కన్యూమర్స్ ఎవరు అనేది దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. డ్రగ్స్ సేవించే వారికి హైదరాబాద్ సీపీ ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు. ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తో పట్టుబడితే డ్రగ్స్ సేవించే వారిపై కూడా చర్యలు కఠినంగా ఉంటాయని, డ్రగ్స్‌ను వాడడం తో పాటు పక్క వారికి అలవాటు చేసిన వారిపై కూడా కేసులు పెడుతామని సిపి హెచ్చరించారు. మారకద్రవ్యాలు దుర్వినియోగానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే హెచ్ న్యూ టీమ్స్ 8712661601 నంబర్‌కు అందించాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి