రెస్టారెంట్స్‌లో ఆహార నాణ్యతకు సంబంధించి ఇటీవల వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడ్డాయి. అయితే తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో ఇలాంటి ఓ ఘటన మళ్లీ వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ ఏఎస్‌రావు నగర్‌లోని ప్రముఖ రెస్టారంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉమేష్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల తన కుటుంబంతో కలిసి జూన్ 11వ తేదీన చట్నీస్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే దోస, స్టీమ్‌డ్ దోస, ఇడ్లీతో పాటు వాటర్‌ను ఆర్డర్ చేశారు. మొత్తం రూ. 522 బిల్ అయ్యింది. అయితే ఈ సమయంలో టిఫిన్‌కి ఇచ్చిన చట్నీలో ఒక వెంట్రుక కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని రెస్టారెంట్ మేనేజర్‌కి తెలియజేశాడు. వెంటనే మేనేజర్ క్షమాపణలు చెప్పి ప్లేట్‌ను మార్చేశాడు.
అయితే ఉమేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తనకు ఎదురైన చేతు అనుభవాన్ని వివరిస్తూ.. ‘ఈసీఐఎల్ రాధికకు సమీపంలో ఉన్న చట్నీస్ రెస్టరంట్‌లో టిఫిన్ చేస్తున్న సమయంలో మాకు చట్నీలో వెంట్రుక కనిపించింది. ఈ విషయాన్ని మేనేజర్‌కి చెప్పగానే ప్లేట్‌ను మార్చేశారు. ఏది ఏమైనా ఇది ఒక చేదు అనుభవం అంటూ’ రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది.
అంతేకాకుండా రెస్టారెంట్‌లో అందిస్తున్న ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్‌పై టీడీఎస్ స్థాయిలను ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ‘నేను చట్నీస్ రెస్టారెంట్‌లో బిస్లరీ వాటర్ బాటిల్ కొనుగోలు చేశాను. ఇంటికి వెళ్లి వాటర్ క్వాలిటీ చెక్ చేయగా.. TDS రేటింగ్‌లు 80, 75, 74గా ఉందని తెలిపారు. దీంతో ఈ ఘటనపై స్పందించిన ఏఎంఓహెచ్ కప్రా హెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 674 ప్రకారం రెస్టారెంట్‌పై రూ.5,000 జరిమానా విధించారు.
Found a hair in the chutney at Chutneys, A S Rao Nagar, near Radhika, ECIL. Brought it to the notice of the Chutneys’ manager, and he accepted it and replaced the food with a new dish. However, it was an unpleasant experience.😏
CC: @AFCGHMC @cfs_telangana pic.twitter.com/qY8bxC7CCx
— Srikhande Umesh Kumar (@srikhande_umesh) June 11, 2024
ఇదిలా ఉంటే.. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్‌లోని రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం గత నెలలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లోని రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి నాలుగు రెస్టారెంట్స్ ఉల్లంఘనలను గుర్తించింది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..