కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యానికి ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్యులు చికిత్సను నిలిపివేశారు. అయితే గత కొన్ని నెలలుగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. అంబులెన్స్‌లో వచ్చి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ముఖేష్ గౌడ్. కాగా ఈ ఎన్నికల్లో గోషామహల్ నియోజవకర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముఖేష్ గౌడ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. మరోవైపు ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముఖేష్ గౌడ్ త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థిస్తున్నారు.