Telangana: చల్లటి కబురు.. తెలంగాణలో వచ్చే 3 రోజులు ఉరుములతో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

|

Oct 02, 2024 | 5:59 PM

తెలంగాణకు వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు.. మరికొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందంది. ఆ వివరాలు..

Telangana: చల్లటి కబురు.. తెలంగాణలో వచ్చే 3 రోజులు ఉరుములతో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
Rain Alert
Follow us on

తెలంగాణకు వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు.. మరికొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అలాగే ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మంతో పాటు కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. అటు రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..