Hyderabad: హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్.. కీలక ప్రకటన

|

Sep 23, 2021 | 6:13 PM

హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చేందుకు గత ఏడు సంవత్సరాలుగా అనేక మౌలిక వసతుల సదుపాయాల కల్పన కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Hyderabad: హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్.. కీలక ప్రకటన
Minister Ktr
Follow us on

హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చేందుకు గత ఏడు సంవత్సరాలుగా అనేక మౌలిక వసతుల సదుపాయాల కల్పన కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ చెప్పారు. భాగ్యనగరంలో తాగునీటి, విద్యుత్ సమస్య లేకుండా  సమస్యలను పరిష్కరించామన్నారు. జలమండలి సమర్థవంతమైన పనితీరు వలన హైదరాబాద్ నగరానికి వాటర్ ప్లస్ సిటీ హోదా దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.  జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉండే ప్ర‌జ‌ల‌కు కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే ప‌దేళ్ల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని సీవ‌రేజ్(మురుగునీరు శుద్ధి) ప్లాంట్ల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. సీవ‌రేజ్ ప్లాంట్ల నిర్మాణానికి రూ. 3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించింది అని కేటీఆర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన జీవోను గురువారం తెలంగాణ సర్కార్ విడుద‌ల చేసింది.

హెచ్‌యూఏ ప‌రిధిలో రోజుకు 1950 ఎంఎల్‌డీ మురికి నీరు ఉత్ప‌త్తి అవుతోందని… జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1650 ఎంఎల్‌డీ మురికి నీరు ఉత్ప‌త్తి అవుతోందని కేటీఆర్ చెప్పారు. మూసీ ప్ర‌క్షాళ‌న‌, చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లామని.. కేబినెట్ మీటింగ్‌లోనూ ఈ అంశంపై విస్తృత చ‌ర్చ జ‌రిగిందన్నారు. రాబోయే ప‌దేళ్ల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని సీవ‌రేజి ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్ర‌స్తుతం జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న 772 ఎంఎల్‌డీ సీవ‌రేజ్(మురుగునీరు శుద్ధి) ప్లాంట్ల‌కు అద‌నంగా 1260 ఎంఎల్‌డీ సీవ‌రేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. దీనికోసం రూ. 3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించిందని… 31 ప్రాంతాల్లో ఈ సీవ‌రేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల త‌ర‌పున సీఎం కేసీఆర్‌కు హృద‌య‌పూర్వ‌క‌మైన ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఇక కంటోన్మెంట్ వల్ల చాలా మందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేటీఆర్ తెలిపారు.  ఆ ప్రాంతంలో అభివృద్ధి లేదని.. ప్రభుత్వం ఎన్ని సార్లు ముందుకు వచ్చి అడిగినా ఫలితం లేదని చెప్పారు.  కంటోన్మెంట్ బోర్డు పద్ధతి సరిగా లేదని..  మెజారిటీ ప్రజలు కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని కోరుతున్నారని చెప్పారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Also Read: భార్య ఉండనని చెప్పి పుట్టింటికి వెళ్లింది.. అతడి షాకింగ్ నిర్ణయంతో, జీవితాలు అస్తవ్యస్తం

“మత్తుపై ఉక్కుపాదం”.. ఎస్‌ఈబీ అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు