KTR: 1200 ఎకరాల్లో ఈ వెహికిల్స్ తయారీ కంపెనీలు.. 4 లక్షల మందికి ఉద్యోగాలు: కేటీఆర్‌

|

Feb 06, 2023 | 8:43 PM

తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా రానున్న రోజుల్లో 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా తెలంగాణ అభివృద్ది చెందుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో..

KTR: 1200 ఎకరాల్లో ఈ వెహికిల్స్ తయారీ కంపెనీలు.. 4 లక్షల మందికి ఉద్యోగాలు: కేటీఆర్‌
Ts Minister Ktr
Follow us on

తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా రానున్న రోజుల్లో 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా తెలంగాణ అభివృద్ది చెందుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ 2023 కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. మంత్రి నిరంజన్ రెడ్డి, డెలిగేట్స్ తో కలిసి ఈ మొబిలిటీ వ్యాలీ నమూనా బిల్డింగ్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడతుఊ.. ‘ఇండియాలోనే బెస్ట్ సిటీ అయిన హైదరాబాద్ లో ఈ మొబిలిటీ వీక్ ఈవెంట్ జరగడం సంతోషకరం. హైదరాబాద్ వేదికగా ఈ ఈ -మొబిలిటీ వీక్‌ ఘనంగా ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఈవీ రంగాన్నీ మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కావల్సినన్ని వనరుల ఉండడం వల్ల ఈవీ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. వికారాబాద్, ఎల్కతాలలో12 ఎకరాల్లో ఈ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని’ మంత్రి తెలిపారు.

ఈ మొబిలిటీ వ్యాలీ ద్వారా రానున్న మూడేళ్లలో 50వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి తెలిపారు. దీంతో కొత్తగా 4 లక్షల ఉద్యోగాలు రానున్నాయన్నారు. తెలంగాణలో నాలుగు ప్రదేశాల్లో మెగా క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీల తయారీతో పాటు బ్యాటరీ పార్ట్స్ కూడా తయారవుతాయని మంత్రి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..