Telangana: తెలంగాణపై వరుణుడి ప్రతాపం.. ఈ నెల 27 వరకు వర్షాలు.. హెచ్చరికలు జారీ

వరదలు, వర్షాల నుంచి తేరుకోకముందే వాతావరణశాఖ అధికారులు మరో పిడుగు లాంటి వార్తను వెల్లడించారు. తెలంగాణ (Telangana) లో ఈ నెల 27 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అంతే కాకుండా ఆయా జిల్లాలకు హెచ్చరికలు...

Telangana: తెలంగాణపై వరుణుడి ప్రతాపం.. ఈ నెల 27 వరకు వర్షాలు.. హెచ్చరికలు జారీ
Telangana Rains
Follow us

|

Updated on: Jul 25, 2022 | 4:08 PM

వరదలు, వర్షాల నుంచి తేరుకోకముందే వాతావరణశాఖ అధికారులు మరో పిడుగు లాంటి వార్తను వెల్లడించారు. తెలంగాణ (Telangana) లో ఈ నెల 27 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అంతే కాకుండా ఆయా జిల్లాలకు హెచ్చరికలు (Alerts) జారీ చేసింది. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడిన ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉందని పేర్కొంది. ఫలితంగా నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. సోమవారం (ఇవాళ) ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపలల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే గానీ బయటకు రావద్దని సూచించింది.

మరోవైపు.. శ్రీరామసాగర్‌కు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు చరిత్రలో జులై 10వ తేదీన దిగువకు నీటిని విడుదల చేయడం మొదటి సారి. గతంలో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో గేట్లు ఎత్తగా.. ఈ సారి భారీగా ప్రవాహం రావడంతో ముందు జాగ్రత్తగా పూర్తిస్థాయి నీటి మట్టానికి మూడు అడుగులు తగ్గించి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూన్‌ 1 నుంచి ఆదివారం వరకు 170.409 టీఎంసీలు వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. 1087.60 అడుగుల వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..