టీఆర్ఎస్ నేత, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. నగరంలోని చిక్కడపల్లిలో ఓ హెటల్‌లో వేడుకకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన లిఫ్ట్ ఎక్కగా.. అది మొదటి అంతస్థు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను యశోదా ఆస్పత్రికి తరలించారు. మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చేసి హన్మంతరావును పరామర్శించారు.