హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో సినీ నటి ఛౌరాసియాపై అటాక్ చేసిన నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. వారం రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. సినీ నటి ఛౌరాసియాపై దాడి చేసింది లైట్‌మెన్ కొమ్ము బాబుగా పోలీసులు తెలిపారు. కృష్ణానగర్‌లో నివాసముండే బాబు… సినీ ఫీల్డ్‌లో లైట్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కేబీఆర్ పార్క్‌లో ఛౌరాసియాపై అటాక్ చేసిన బాబు … ఆమె ఫోన్ లాక్కుని పారిపోయాడు. అయితే, పార్క్‌లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితుడ్ని గుర్తించడం కష్టంగా మారింది. అటాక్ తర్వాత పారిపోతూ ఒకచోట సీసీ కెమెరాకు చిక్కడంతో చివరికి నిందితుడ్ని పట్టుకున్నారు పోలీసులు.
నిందితుడు యూసఫ్‌గూడ కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సినీ పరిశ్రమలో బాబు లైట్ బాయ్‌గా పని చేస్తున్నాడని పోలీసులు వివరించారు. నటిపై దాడి చేసిన అనంతరం.. నిందితుడు కృష్ణానగర్‌లోని నివాసానికి వెళ్లి.. ఫోన్‌ను గదిలో ఉంచాడని పేర్కొన్నారు. నిందితుడుపై గతంలోనూ మూడు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. విజయవాడ, బంజారాహిల్స్, గోల్కొండ పీఎస్‌ల్లో అతనిపై కేసులు నమోదైనట్లు చెప్పారు. గోల్కొండ పీఎస్‌లో నమోదైన పెట్టి కేసులో జైలుకు వెళ్లొచ్చిన బాబు.. తన తీరు మార్చుకోలేదని పేర్కొన్నారు.
Also Read: AP Weather: వెదర్ అప్డేట్.. ఏపీకి పొంచి ఉన్న మరో గండం