Hyderabad: హుస్సేన్‌ సాగర్‌కు సమీపంలో మరో అద్భుత నిర్మాణం.. 10 ఎకరాల్లో, రూ. 15 కోట్లతో..

|

Sep 19, 2023 | 10:09 AM

తాజాగా హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచేలా మరో అద్భుత నిర్మాణాన్ని చేపట్టింది. హుస్సేన్‌ సాగర్‌కు సమీపంలో ఉన్న జలవిహార్‌కు దగ్గరల్లో లేక్‌ ఫ్రంట్ పార్క్‌ను నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ లేక్‌ ఫ్రంట్‌ పార్క్‌ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా ప్రకటించారు. 'హుస్సేన్‌ సాగర్‌కు సమీపంలో, హైదరాబాద్‌ నడిబొడ్డున...

Hyderabad: హుస్సేన్‌ సాగర్‌కు సమీపంలో మరో అద్భుత నిర్మాణం.. 10 ఎకరాల్లో, రూ. 15 కోట్లతో..
Hyderbad
Follow us on

ఓవైపు ఐటీ, మరోవైపు ఫార్మా రంగాల్లో దూసుకుపోతున్న మహా నగరం హైదరాబాద్‌ పర్యాటక రంగంలోనూ దూసుకుపోతోంది. నిజానికి ఐటీ, ఫార్మా రంగానికి కంటే ముందే హైదరాబాద్‌ పర్యాటక రంగంలో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ఎన్నో చారిత్రక కట్టడాలకు నెలవుగా ఉన్న హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు వస్తుంటారు. ఇక హైదరాబాద్‌ ఖ్యాతిని మరింత పెంచుతూ హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) ఎన్నో సుందర నిర్మాణాలను చేపడుతోంది. ఓవైపు ట్రాఫిక్‌ సమస్యను తగ్గించడానికి ఫైఓవర్లు, స్కై వేలు నిర్మిస్తూనే మరోవైపు సుందరీకరణ పనులకు సైతం హెచ్‌ఎండీఏ పెద్ద పీట వేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచేలా మరో అద్భుత నిర్మాణాన్ని చేపట్టింది. హుస్సేన్‌ సాగర్‌కు సమీపంలో ఉన్న జలవిహార్‌కు దగ్గరల్లో లేక్‌ ఫ్రంట్ పార్క్‌ను నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ లేక్‌ ఫ్రంట్‌ పార్క్‌ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ‘హుస్సేన్‌ సాగర్‌కు సమీపంలో, హైదరాబాద్‌ నడిబొడ్డున మరో అద్భుత కట్టడం అందుబాటులోకి వచ్చింది. జలవిహార్‌కు సమీపంలో 10 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ లేట్‌ ఫ్రంట్‌ పార్క్‌ను నిర్మించింది. త్వరలోనే ఈ పార్క్‌ను ప్రారంభించనున్నాము. ప్రజలంతా ఈ కొత్త నిర్మాణాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే ఈ ఫ్రంట్‌ పార్క్‌ నిర్మాణాన్ని హెచ్‌ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రూ. 15 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణంలో అండర్‌పాస్‌లు, స్కైవేలు, సీటింగ్‌తో కూడిన వాటర్‌ ఛానల్స్‌, లేక్‌ వంటి అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. మధ్యలో చిన్నపిల్లలకు ఆటవిడుపు కోసం పార్క్‌ను కూడా నిర్మించారు.

ఇదిలా ఉంటే.. ఈ నిర్మాణం వల్ల 35 పక్షి జాతులకు భంగం వాటిల్లుతుందని పర్యావరణవేత్తల పిటిషన్‌ నేపథ్యంలో గతంలో సుప్రీం కోర్టు లేక్‌ ఫ్రంట్‌ నిర్మాణంపై ఆంక్షలు విధించింది. జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించే విధంగా హుస్సేన్‌ సాగర్ చుట్టూ ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టకూడదని సుప్రీం కోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అయితే జీవవైవిధ్యానికి ఎలాంటి నష్టం జరగకుండానే ఈ నిర్మాణం చేపడుతున్నట్లు హెచ్‌ఎండీఏ కోర్టుకు తెలిపింది. ఇలా పలు సార్లు వాదనలు ముగిసిన తర్వాత ఎట్టకేలకు లేక్‌ ఫ్రంట్ నిర్మాణం పూర్తయి ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..