‘కొండా’కు షరతులతో కూడిన బెయిల్

| Edited By:

May 15, 2019 | 5:00 PM

తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో తన బెయిల్ పత్రాలు, ష్యూరిటీని బంజారాహిల్స్‌ పీఎస్‌లో పోలీసులకు సమర్పించారు కొండా. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొండా అనుచరుడు సందీప్ రూ.10లక్షలతో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ వ్యవహారంలో నోటీసులు అందించేందుకు కొండా విశ్వేశ్వర రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులను గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. కాగా ఈ కేసులో […]

‘కొండా’కు షరతులతో కూడిన బెయిల్
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో తన బెయిల్ పత్రాలు, ష్యూరిటీని బంజారాహిల్స్‌ పీఎస్‌లో పోలీసులకు సమర్పించారు కొండా. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొండా అనుచరుడు సందీప్ రూ.10లక్షలతో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ వ్యవహారంలో నోటీసులు అందించేందుకు కొండా విశ్వేశ్వర రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులను గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. కాగా ఈ కేసులో ఇదివరకే కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరైన విషయం తెలిసిందే.