డ్రంక్ అండ్ డ్రైవ్.. అడ్డంగా దొరికిన 85 మంది

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున వాహనదారులు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న 85 మందిని గుర్తించి, వారిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఫూటుగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిలో ఓ యువతి కూడా పట్టుబడింది. వీరిపైన పోలీసులు కేసులు పెట్టారు. వీరందరి నుంచి 40 కార్లు, మరో 42 బైక్‌లతోపాటు 3 ఆటోలను పోలీసులు […]

డ్రంక్ అండ్ డ్రైవ్.. అడ్డంగా దొరికిన 85 మంది
Follow us

| Edited By:

Updated on: Feb 09, 2020 | 7:30 AM

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున వాహనదారులు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న 85 మందిని గుర్తించి, వారిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఫూటుగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిలో ఓ యువతి కూడా పట్టుబడింది. వీరిపైన పోలీసులు కేసులు పెట్టారు. వీరందరి నుంచి 40 కార్లు, మరో 42 బైక్‌లతోపాటు 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకొని స్టేషన్లకు తరలించారు. అలాగే.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారందరినీ బేగంపేట పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇస్తామన్నారు ట్రాఫిక్ పోలీసులు.

అయితే.. ఈ తనిఖీల్లో భాగంగా.. పోలీసులు కరోనా గురించి భయపడుతున్నారు. దానికి సంబంధించి పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని వారు తెలిపారు. ముఖాలకి, చేతులకి మాస్క్‌లని ధరించి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నామన్నారు.