Drug Business: భార్య భర్తల మత్తు వ్యాపారం.. బెంగుళూరులో భళా.. హైదరాబాద్‌లో విలవిల

బెంగళూరు నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం. తన భర్త చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి మద్దతుగా భార్య సైతం సహాయం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. బెంగళూరు నుండి తక్కువ రేటుకు డ్రగ్స్‌ కొనుగోలు చేసి వీటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఎక్కువ రేటుకు..

Drug Business: భార్య భర్తల మత్తు వ్యాపారం.. బెంగుళూరులో భళా.. హైదరాబాద్‌లో విలవిల
Drug Business
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jun 15, 2024 | 8:42 PM

బెంగళూరు నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం. తన భర్త చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి మద్దతుగా భార్య సైతం సహాయం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. బెంగళూరు నుండి తక్కువ రేటుకు డ్రగ్స్‌ కొనుగోలు చేసి వీటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు దంపతులు. హైదరాబాదులో ఒక్కో గ్రామ ఎమ్ డి ఎమ్ ఏ డ్రగ్స్‌ ఎనిమిది వేలకు అమ్ముతున్నారు.

సయ్యద్ పైసల్ తో పాటు అతని భార్య బేగం కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశారు. తమకు తెలిసిన స్నేహితుల ద్వారా బహదూర్పు కు చెందిన పలువురుతో కలిసి ముఠాగా ఏర్పడి డ్రగ్స్ అవసరం ఉన్నవారికి సరఫరా చేస్తున్నారు. వీరి లిస్టులో మొత్తం 19 మంది కన్జ్యూమర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. డ్రగ్ పెడ్లర్ నుండి డ్రగ్స్ ను విక్రయించి వాటిని తన భార్య బేగం ద్వారా కావాల్సిన కస్టమర్స్ కు సరఫరా చేస్తున్నారు. ఇద్దరు దంపతులతో పాటు మహమ్మద్ అబ్రార్, జునైద్ ఖాన్, రెహ్మద్ ఖాన్, లను పోలీసులు అరెస్టు చేశారు.

మహిళలను పోలీసులు తనిఖీ చేయరు అనే ఉద్దేశంతో తన భార్యను సైతం డ్రగ్స్ వ్యాపారంలోకి దింపాడు సయ్యద్ పైసల్. అక్కడ బెంగళూరులో అందరూ కలిసి 34 గ్రాముల ఎండిఎం ఎ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. జూన్ 10వ తారీఖున బహదూర్పురాలో ఇతర కన్జ్యూమర్లకు డ్రగ్స్‌ను విక్రయిస్తున్న క్రమంలో నార్కోటిక్ పోలీసులు పక్క సమాచారంతో వీరిని పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారు నలుగురు కూడా క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఇటీవల డ్రగ్స్ కు బానిసలుగా మారి నేరాల బాట పడుతున్న యువతకు పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. తమ బంగారు భవిష్యత్తును డ్రగ్స్ మూలాన నాశనం చేసుకోవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల కదలికలపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేసేందుకు 8712671111 నంబర్ కు కాల్ చేయాల్సిందిగా పోలీసులు తెలిపారు.

Latest Articles
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు మంత్రి అచ్చెన్న ఆసక్తికర సలహా..
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు మంత్రి అచ్చెన్న ఆసక్తికర సలహా..
మీ వాహనం ఫిట్‌గా లేకపోతే మీ లైఫ్ ఫట్..!
మీ వాహనం ఫిట్‌గా లేకపోతే మీ లైఫ్ ఫట్..!
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఏకంగా 2వసారి బాదేశాడుగా..
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఏకంగా 2వసారి బాదేశాడుగా..
లో స్పీడ్ ఈ-స్కూటర్లకు డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ లైట్లు అవసరమా?
లో స్పీడ్ ఈ-స్కూటర్లకు డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ లైట్లు అవసరమా?
ఒకే సారి ఇన్వెస్ట్‌ చేస్తే నెలకు రూ.12 వేల పెన్షన్‌..
ఒకే సారి ఇన్వెస్ట్‌ చేస్తే నెలకు రూ.12 వేల పెన్షన్‌..
ఆడాళ్ళను క్యారెక్టర్ లేని వాళ్లలా ఎందుకు చూస్తారు.?
ఆడాళ్ళను క్యారెక్టర్ లేని వాళ్లలా ఎందుకు చూస్తారు.?
నేడు జగన్నాథ సహస్త్రధార స్నానం.. 14 రోజుల పాటు గర్భాలయం మూసివేత..
నేడు జగన్నాథ సహస్త్రధార స్నానం.. 14 రోజుల పాటు గర్భాలయం మూసివేత..
సెమీ-ఫైనల్‌కు చేరేది ఎవరు.. 3 అగ్రశ్రేణి జట్ల మధ్య హోరాహోరీ పోరు
సెమీ-ఫైనల్‌కు చేరేది ఎవరు.. 3 అగ్రశ్రేణి జట్ల మధ్య హోరాహోరీ పోరు
తిరుగులేని బిజినెస్ ఇది.. నెలకు రూ. లక్ష తగ్గకుండా సంపాదించవచ్చు
తిరుగులేని బిజినెస్ ఇది.. నెలకు రూ. లక్ష తగ్గకుండా సంపాదించవచ్చు
స్త్రీలా..? పురుషులా..? ఎవరికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ..
స్త్రీలా..? పురుషులా..? ఎవరికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ..