టాలీవుడ్‌లో మళ్లీ మొదలైన శ్రీలీల హవా.. ఈసారి ఆపడం కష్టమే

TV9 Telugu

22 June 2024

యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ధమకాతో బ్లాక్ బస్టర్ అందుకుంది

గతేడాది ఆమె నటించిన సినిమాలు అరడజనుకు పైగా విడుదలయ్యాయి. అయితే అవేవీ పెద్దగా క్లిక్ అవ్వలేదు.

బాలకృష్ణతో నటించిన భగవంత్ కేసరి మినహా శ్రీలీల నటించిన సినిమాలన్నీ అభిమానులను బాగా నిరాశపర్చాయి.

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ రావడంతో  శ్రీలీల సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే గతంలోలాగానే శ్రీలీల ఇప్పుడు మళ్లీ బిజీగా మారుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్ ' సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కానుంది.

నితిన్ ,వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ సినిమాలోనూ శ్రీలీలనే హీరోయిన్ గా ఎంపికైంది.

అలాగే రవితేజ 75 మూవీలోనూ శ్రీలీల ఆఫర్ అందుకుంది. గతంలో వీరిద్దరు కలిసి నటించిన ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.